Page Loader
Assam: ఐఎస్ఐఎస్‌లో సంస్థలో చేరతానని ఈమెయిల్‌.. ఐఐటీ గౌహతి విద్యార్థి అరెస్ట్
ఐఎస్ఐఎస్‌లో సంస్థలో చేరతానని ఈమెయిల్‌.. ఐఐటీ గౌహతి విద్యార్థి అరెస్ట్

Assam: ఐఎస్ఐఎస్‌లో సంస్థలో చేరతానని ఈమెయిల్‌.. ఐఐటీ గౌహతి విద్యార్థి అరెస్ట్

వ్రాసిన వారు Stalin
Mar 24, 2024
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

నిషేదిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌(ISIS)లో చేరేందుకు వెళుతున్నాడనే ఆరోపణలపై శనివారం సాయంత్రం ఐఐటీ గౌహతి విద్యార్థిని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గువహటిలోని హజో పట్టణానికి సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు . ధుబ్రీ జిల్లాలో ఐఎస్ఐఎస్ ఇండియా చీఫ్ హరీస్ ఫారూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫారూఖీ, అతని సహచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్‌లను అరెస్టు చేసిన నాలుగు రోజుల తర్వాత విద్యార్థి పట్టుబడ్డాడు. అదుపులోకి తీసుకున్న విద్యార్థి దిల్లీకి చెందిన వ్యక్తి అని సమాచారం. విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జిపి సింగ్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

Details

ఈ ఇమెయిల్‌లో ISISలో చేరబోతున్నట్లు పేర్కొన్న విద్యార్థి 

విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈమెయిల్‌ అందడంతో విద్యార్థిపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఇమెయిల్‌ను విద్యార్థి పంపాడు, అందులో అతను ISISలో చేరబోతున్నట్లు పేర్కొన్నాడు. ఈ-మెయిల్ అందిన వెంటనే పోలీసులు ఐఐటీ-గౌహతి అధికారులను సంప్రదించారు. ఈ విద్యార్థి మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడని, అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని పోలీసులకు చెప్పారు. విద్యార్థి కోసం మళ్లీ అన్వేషణ ప్రారంభించారు. సాయంత్రం, స్థానిక ప్రజల సహాయంతో, గౌహతి నుండి 30 కిమీ దూరంలోని హజో ప్రాంతం నుండి పట్టుకున్నారు.

Details

విద్యార్థి హాస్టల్ గదిలో 'ఐఎస్ఐఎస్‌ను పోలిన' నల్లజెండా

ప్రాథమిక విచారణ అనంతరం అతడిని ఎస్టీఎఫ్‌ కార్యాలయానికి తరలించారు. ఈ-మెయిల్‌ ఉద్దేశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి హాస్టల్ గదిలో 'ఐఎస్ఐఎస్‌ను పోలిన' నల్లజెండా కనిపించింది. నిషేధిత సంస్థలతో వ్యవహరించే ప్రత్యేక ఏజెన్సీలకు దర్యాప్తు కోసం జెండా పంపబడింది. విద్యార్థి నుంచి మరికొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.