LOADING...
IIT Madras:  ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2025లో మరోసారి అగ్రస్థానంలో IIT మద్రాస్‌
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2025లో మరోసారి అగ్రస్థానంలో IIT మద్రాస్‌

IIT Madras:  ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2025లో మరోసారి అగ్రస్థానంలో IIT మద్రాస్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ (NIRF) 2025 జాబితాను ప్రకటించారు. ఈసారి కూడా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్‌ (IIT Madras) అనేక విభాగాల్లో ప్రథమ స్థానాలను దక్కించుకుని మరోసారి తన ప్రతిభను చాటుకుంది. 'ఓవరాల్' కేటగిరీలో వరుసగా ఏడోసారి టాప్‌ ర్యాంక్‌ పొందిన ఐఐటీ మద్రాస్‌, ఇంజినీరింగ్‌ విభాగంలో పదో ఏడాది వరుసగా మొదటి స్థానంను నిలబెట్టుకుంది. గతంలో రెండో స్థానంలో నిలిచిన ఇన్నోవేషన్‌ (ఆవిష్కరణల) విభాగంలో ఈసారి మొదటి స్థానాన్ని సంపాదించడం విశేషం. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా జోడించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (Sustainable Development Goals) కేటగిరీలోనూ ఐఐటీ మద్రాస్‌ ఆధిపత్యం చాటింది.

వివరాలు 

వికసిత్ భారత్‌ 2047 లక్ష్యసాధనకు కృషి చేస్తాం: వి. కామకోటి

ఈ సందర్భంగా ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ.. "ప్రతి సారి అగ్రస్థానంలో నిలవడం అనేది సమష్టి కృషి, సమన్వయం, బృంద భావనతో సాధ్యమైన ఫలితం. ఇంత అద్భుతమైన బృందం మాకు లభించడం దేవుని దయ అని భావిస్తున్నాను. మేమంతా కలిసి వికసిత్ భారత్‌-2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తాం" అని తెలిపారు.

వివరాలు 

ఓవరాల్ కేటగిరీలో టాప్‌ విద్యాసంస్థలు 

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పుర్‌ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పుర్‌ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూదిల్లీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి

వివరాలు 

టాప్ 10 విశ్వవిద్యాలయాలు 

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూదిల్లీ మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్ జామియా మిలియా ఇస్లామియా, న్యూదిల్లీ దిల్లీ విశ్వవిద్యాలయం, న్యూదిల్లీ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్-పిలానీ అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్ జాదవ్‌పుర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం, అలీగఢ్‌

వివరాలు 

టాప్ 5 కళాశాలలు

హిందూ కళాశాల, దిల్లీ మిరాండా హౌస్, దిల్లీ హన్స్ రాజ్ కళాశాల, దిల్లీ కిరోడి మాల్ కళాశాల, దిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, దిల్లీ