LOADING...
IPL 2026 : క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్ల సేల్ షురూ
క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్ల సేల్ షురూ

IPL 2026 : క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్ల సేల్ షురూ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 19, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు వస్తుండటంతో ప్లేఆఫ్స్, గ్రాండ్ ఫైనల్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక అప్‌డేట్ ప్రకటించింది. ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాల తేదీలను అధికారికంగా వెల్లడించింది. ఈసారి టిక్కెట్ల విక్రయాల బాధ్యతను డిస్ట్రిక్ట్ బై జొమాటో సంస్థకు అప్పగించారు.

వివరాలు

టిక్కెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభం?

ప్లేఆఫ్స్ టిక్కెట్లను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ముందుగా రూపే కార్డు హోల్డర్లకు ప్రత్యేక ప్రయారిటీ విండో ఇవ్వనున్నారు. వీరికి 24 గంటల ముందే, అంటే మే 20 నుంచే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌ల టిక్కెట్లను ఈ ప్రత్యేక విండోలోనే రిజర్వ్ చేసుకోవచ్చు. సాధారణ ప్రేక్షకుల కోసం మే 21 నుంచి టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇక ఫైనల్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లకు సంబంధించి మే 22న ప్రయారిటీ విండో అందుబాటులోకి రానుండగా, మే 23 నుంచి సాధారణ టిక్కెట్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

వివరాలు

ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్లు

ప్రస్తుతానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా ప్లేఆఫ్స్‌లో తమ స్థానం కన్ఫాం చేసుకున్నాయి. మిగిలిన ఒక స్థానానికి పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఏ జట్టు ఎవరి మీద తలపడుతుందో ఇంకా స్పష్టత లేకపోయినా, అభిమానుల్లో టిక్కెట్ల కోసం భారీ హడావిడి నెలకొంది.

Advertisement

వివరాలు

మ్యాచ్‌ల వేదికలు ఎక్కడంటే?

ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు వేర్వేరు నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మే 26న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరగనుంది. అనంతరం మే 27న చండీగఢ్‌లోని కొత్త పీసీఏ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహిస్తారు. మే 29న క్వాలిఫైయర్-2 కూడా చండీగఢ్‌లోనే జరుగుతుంది. ఇక ఐపీఎల్ 2026 విజేతను నిర్ణయించే తుది పోరు మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఫ్యాన్స్ జొమాటో యాప్ లేదా ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

Advertisement