Janhvi Kapoor: కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్.. ధృవ్ విక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కెరీర్ ప్రారంభంలో సరైన కథలను ఎంచుకోలేక వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. అయితే బాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో విజయాలు రాకపోయినా, సౌత్ ఇండస్ట్రీ—ముఖ్యంగా టాలీవుడ్—ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు పొందడమే కాకుండా ఇప్పుడు కోలీవుడ్‌లోనూ బంపర్ ఆఫర్‌తో పాన్-సౌత్ స్టార్‌గా దూసుకుపోతోంది. తాజాగా తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం, వర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) హీరోగా తెరకెక్కనున్న ఓ భారీ యాక్షన్ విజువల్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
వివరాలు
కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాన్వీ
ఈ ప్రాజెక్ట్ కోసం ముందుగా 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth)ను హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, అనివార్య కారణాలు మరియు డేట్స్ సమస్యలతో ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఫామ్‌లో ఉన్న జాన్వీ కపూర్‌ను సంప్రదించగా, కథ నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ధృవ్ విక్రమ్ సరసన జాన్వీ తమిళ ఎంట్రీ ఖరారైనట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'దేవర' విజయం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ సాధిస్తే, టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ నంబర్ వన్ స్థానానికి చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.