
Wife Kills Husband: బావతో అక్రమ సంబంధం.. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి అపై కరెంట్ షాక్‌తో హత్య!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని ద్వారకా ప్రాంతంలో భర్తను భార్య హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 35ఏళ్ల కరణ్ దేవ్ అనే వ్యక్తిని అతని భార్య సుస్మితా దేవ్ తన బావ రాహుల్ దేవ్ తో కలిసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కరణ్ దేవ్ మృతదేహం గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో కనబడింది. మొదట మృతుడు కరెంట్ షాక్‌కు గురై చనిపోయాడని కుటుంబానికి నమ్మబలికే ప్రయత్నం చేశారు. కానీ కరణ్ సోదరుడికి అనుమానం వచ్చి, పోస్టుమార్టం కోసం ఒత్తిడి చేశాడు. ప్రాథమికంగా నిందితురాలు, ఆమె బావ, రాహుల్ తండ్రి పోస్టుమార్టానికి వ్యతిరేకించారు. కానీ డాక్టర్లు మృతుడి వయసు పరిగణనలోకి తీసుకుని పోస్టుమార్టం నిర్వహించడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చంది.
Details
పోలీసుల అదుపులోకి భార్య
భార్య, బావ కలిసి కరణ్ దేవ్‌ను చంపేందుకు ముందుగానే ప్లాన్ తయారు చేసినట్లు తేలింది. ప్లాన్ ప్రకారం.. డిన్నర్ సమయంలో సుస్మితా భర్తకి ఆహారంలో 15 నిద్రమాత్రలు కలిపింది. అతడు స్పృహ కోల్పోయే వరకూ వేచి ఉన్నారు. అనంతరం స్పృహతప్పిన కరణ్‌కు విద్యుత్ షాక్ ఇచ్చారు. ఆ సమయంలో బాధితుడు ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ, మరణించేందుకు తగినంత కరెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. నిద్రమాత్రలు మింగిన తర్వాత ఎంతసేపటికి చావొస్తుంది?అనే విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసిన రికార్డులు కూడా బయటపడ్డాయి. ఇద్దరూ ఈ ఘాతుకానికి ముందు వాట్సాప్ ద్వారా మాట్లాడుకున్న చాట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగినట్లు చిత్రీకరించాలని భావించారు.పోలీసుల విచారణలో భార్య సుస్మితా దేవ్ నేరాన్ని అంగీకరించింది.