Telangana: తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్.. ఈనెల 23, 24 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుతూ, ఎండలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ విడుదల చేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Details
ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలివే
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, ఈనెల 22వ తేదీన రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. 23వ తేదీన కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచన ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఈనెల 24వ తేదీ కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Details
ఈనెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణమే
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత, ఈనెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణమే కొనసాగనుంది. ఎలాంటి వర్ష సూచనలూ లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచనలు ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచనలు ఉన్నా, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Details
రాయలసీమ పరిస్థితి
ఈనెల, ఈనెల రేపు రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఎల్లో, ఆరెంజ్, రెడ్ హెచ్చరికలు ఏవీ జారీ కాలేదని స్పష్టం చేసింది.