
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా సూర్యుడు కనిపించకుండా పోయాడు.
విపరీతంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుతున్నాయి. నదులు ఉధృతంగా పారుతున్నాయి.
వర్షాలు ఎక్కువగా కురుస్తుండడం వల్ల తెలంగాణలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వర్ష ప్రభావం మరో రెండు ఉండనుందని విశాఖపట్నం వాతావారణ కేంద్రం వెల్లడి చేసింది.
బంగాళాఖాతంలో జులై 24వ తేదీన అల్లపీడనం ఏర్పడనుందని, అందువల్ల మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి వాతావరణ శాఖ హెచ్చరించింది.
Details
రిజర్వాయర్ల నుండి సముద్రంలోకి నీటి విడుదల
విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్ల గేట్లను ఎత్తి నీటిని పంపేస్తూ ఉన్నారు.
గత మూడు రోజులుగా పోలవరం వద్ద పెరిగిన నీటిమట్టం ఈరోజు తగ్గుముఖం పట్టింది. 48గేట్ల ద్వారా 6,75,910క్యూసెక్కుల నీటిని బయటకు వదిలేయడంతో నీటి మట్టం తగ్గుతూ వస్తోంది.
యానాం-ఎదుర్లంక దగ్గర గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో, అక్కడి గ్రామాల పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించేసారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుండి 11వేల క్యూసెక్కుల నీటిని డెల్టా పంట కాలువలకు, 9.32లక్షల నీటిని సముద్రంలోకి విడుదల చేసారు. దీంతో నీటిమట్టం తగ్గింది.