LOADING...
BC Bandh: తెలంగాణలో బంద్‌ ప్రభావం.. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం
తెలంగాణలో బంద్‌ ప్రభావం.. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం

BC Bandh: తెలంగాణలో బంద్‌ ప్రభావం.. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా ఇవ్వాలంటూ తెలంగాణవ్యాప్తంగా బీసీ ఐకాస్ ఆహ్వానించిన బంద్‌ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా, మిగతా అన్ని రంగాల బంద్‌కి పూర్తి మద్దతు ఇచ్చి పనిచేయడం ఆగిపోగా, వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతుగా నిలిచాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, భారత రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలు, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు ఈ బంద్‌కి మద్దతు ప్రకటించాయి. పలు ప్రాంతాల్లో బీసీ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగగా, డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు.

Details

శాంతియుతంగా నిర్వహించాలి

బంద్‌లో పాల్గొని దుకాణాలు, వ్యాపార సంస్థలు కూడా మద్దతు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బంద్‌ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉప్పల్‌, చెంగిచర్ల డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ డిపో ముందు భారత రాష్ట్ర సమితి నేత శ్రీనివాస్‌గౌడ్ ధర్నాలో పాల్గొన్నారు. నిజామాబాద్‌, వికారాబాద్‌ ఆర్టీసీ డిపోల ముందు కూడా నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక తెలంగాణ డీజీపీ బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని ప్రత్యేక సూచనలిచ్చారు. ప్రజల భద్రతకు ప్రత్యేక దృష్టి పెట్టాలని హెచ్చరించారు.