Loading...
Telangana: అధిక ఉష్ణోగ్రతల ఎఫెక్ట్‌.. దేశంలో పెరుగుతున్న డెంగీ, చికున్‌గున్యా కేసులు
అధిక ఉష్ణోగ్రతల ఎఫెక్ట్‌.. దేశంలో పెరుగుతున్న డెంగీ, చికున్‌గున్యా కేసులు

Telangana: అధిక ఉష్ణోగ్రతల ఎఫెక్ట్‌.. దేశంలో పెరుగుతున్న డెంగీ, చికున్‌గున్యా కేసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఏటికేడు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల ప్రభావంతో ముఖ్యంగా నగరాల్లో డెంగీ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన డాక్టర్ సంధ్యా అహుజా 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో నిర్వహించిన పరిశోధన ఆధారంగా రూపొందించిన అధ్యయన పత్రం ఇటీవల 'ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ క్లైమేట్ రీసెర్చ్' జర్నల్‌లో ప్రచురితమైంది.

వివరాలు

ఏపీలో డెంగీ కేసులు పెరుగుదల

అధ్యయనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 5,286 డెంగీ కేసులు

నమోదయ్యాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో కేసులు తగ్గినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ పెరిగాయి.

2023లో 6,453, 2024లో 5,555 డెంగీ కేసులు నమోదైనట్లు పరిశోధన వెల్లడించింది.

తెలంగాణలో చికున్‌గున్యా కేసులు

తెలంగాణలో 2019 నుంచి 2024 వరకు మొత్తం 2,004 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయని అధ్యయనంలో పేర్కొన్నారు.

ప్రతి ఏడాది పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావమే ఈ వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణమని పరిశోధకులు విశ్లేషించారు.

వివరాలు

వాతావరణ మార్పులతో దోమల వ్యాప్తి వేగం

తీవ్రమైన ఎండల తర్వాత కురిసే భారీ వర్షాల కారణంగా ఏడెస్ ఈజిప్టి (Aedes aegypti) దోమల జీవన చక్రం వేగవంతమవుతోందని అధ్యయనం తెలిపింది.

దీంతో డెంగీ, చికున్‌గున్యా వైరస్‌లు మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంది.

కుటుంబాలపై భారీ ఆర్థిక భారం

ఈ వ్యాధుల బారిన పడిన ప్రతి కుటుంబంపై రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు ఆర్థిక భారం పడుతోందని నివేదిక వెల్లడించింది.

వైద్య ఖర్చులతో పాటు, రోజువారీ కూలీలు, పట్టణ ప్రాంతాల ప్రజలు పని చేయలేక కోల్పోయే ఆదాయం వంటి పరోక్ష నష్టాలను కూడా ఇందులో ప్రస్తావించారు.

ADVERTISEMENT

వివరాలు

చికున్‌గున్యాతో పనులకు దూరం

చికున్‌గున్యా బారిన పడిన వారిలో 85 శాతం మందికి పైగా కొంతకాలం పనులకు హాజరుకాలేకపోయారని అధ్యయనం వెల్లడించింది.

తీవ్రమైన కీళ్ల నొప్పుల కారణంగా పూర్తిగా కోలుకోవడానికి 15 నుంచి 30 రోజుల వరకు సమయం పట్టిందని, ఒక్కో రోగికి సగటున రూ.2,550 వరకు పరోక్ష ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పరిశోధనలో విశ్లేషించారు.

ADVERTISEMENT