Heavy Rains: అల్పపీడనం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు
హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఈ పరిణామం కారణంగా శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం రూపుదిద్దుకోనుంది. వాయవ్యానికి పశ్చిమ దిశగా కదులుతున్న ఈ అల్పపీడనం, డిసెంబరు 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలను చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.
డిసెంబర్ 11న రాయలసీమలో భారీ వర్షాలు
దీని ప్రభావంతో డిసెంబరు 11, 12 తమిళనాడులో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం మరింత బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశముంది. ఇది వాయుగుండంగా మారిన తర్వాత దాని తీవ్రతపై మరింత స్పష్టత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.