PM High Level Meeting: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. ఢిల్లీలో మోదీ అత్యవసర సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని న్యూదిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కీలక హైలెవల్ సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
Details
కీలక రంగాలపై సమీక్ష
పెట్రోలియం, క్రూడ్ ఆయిల్, గ్యాస్, పవర్, ఎరువుల రంగాలపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా లాజిస్టిక్స్ వ్యవస్థ నిరంతరంగా కొనసాగడంపై దృష్టి సారించారు. ఇంధనం, విద్యుత్, ఎరువుల సరఫరాలో ఎటువంటి అంతరాయం రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులతో చర్చించారు. అదే సమయంలో నిత్యావసర వస్తువుల సరఫరా, ధరల స్థిరీకరణపై కూడా సమీక్ష చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు నాలుగో వారంలోకి ప్రవేశించగా, హర్ముజ్ జలసంధి ద్వారా సాగుతున్న అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడింది.
Details
యుద్ధం నేపథ్యం
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై సైనిక దాడులు ప్రారంభించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా పరిగణించి ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఇదే దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ (86) మరణించినట్లు సమాచారం. ఇంధన రంగంపై ప్రభావం పశ్చిమాసియా సంఘర్షణ మూడు వారాలుగా కొనసాగుతోంది. ఇరాన్‌లోని కీలక గ్యాస్ క్షేత్రం సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఇరాన్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది.
Details
ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు
ఖతార్లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ గ్యాస్ కేంద్రం రాస్ లఫాన్తో పాటు పలు గల్ఫ్ దేశాల్లోని కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేపట్టింది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారి తీశాయి. గ్యాస్ సంక్షోభం, ధరల పెరుగుదల ఇదిలా ఉండగా, హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ సాధించి నౌకల రవాణాను అడ్డుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నెలకొంది. అనేక దేశాల్లో ఎల్పీజీ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల ప్రభావంతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు లీటరుకు రూ. 87.67 నుంచి రూ. 109.59కు చేరి సుమారు 25% పెరుగుదల నమోదు చేశాయి.
Details
అంతర్జాతీయ చర్చలు
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోదీ పలు దేశాల నేతలతో మాట్లాడారు. ఇందులో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఫ్రాన్స్, మలేషియా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు ఉన్నాయి.