Page Loader
ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం
ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం

ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిస్తూ కొత్త రూల్ తీసుకొచ్చిన ప్రభుత్వం

వ్రాసిన వారు Stalin
May 15, 2023
06:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో చిట్‌ఫండ్‌ కంపెనీలు పారదర్శకంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. చిట్‌ఫండ్‌ కంపెనీల లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ చీట్స్ పేరుతో కొత్త ఎలక్ర్టానికి అప్లికేషన్‌ను విడుదల చేసింది. కొత్త ఎలక్ర్టానిక్ అప్లికేషన్‌ను మంగళవారం మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రారంభించారు. ఈ ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ పరిధిలో పని చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. లావాదేవీలు పారదర్శకంగా ఉండేలా ఈ చీట్స్‌ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినట్లు ధర్మాన వెల్లడించారు.

ధర్మాన

రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: ధర్మాన

అన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఎలక్ట్రానిక్ మోడ్‌లోనే పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు. కొత్తవి, పాతవి అని తేడా లేకుండా అన్ని సంస్థలు కచ్చితంగా కొత్త విధానాన్ని పాటించాలన్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు రాజకీయంగా న్యాయం చేసినట్లు చెప్పారు.