Page Loader
దిల్లీకి పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తుపై చర్చ 
దిల్లీకి పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తుపై చర్చ

దిల్లీకి పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తుపై చర్చ 

వ్రాసిన వారు Stalin
Oct 25, 2023
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యేందుకు దిల్లీ బయలుదేరారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తుపై చర్చించేందుకు బుధవారం దిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌తో కలిసి బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

బీజేపీ

32 స్థానాల్లో పోటీ చేసే యోచనలో జనసేన

32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన నేతలు ఇప్పటికే ప్రకటించారు. అందువల్ల రెండు పార్టీల మధ్య ఉమ్మడి పోటీ లాభపడుతుందని భావిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పొత్తు, ఎలా ముందుకు వెళ్లాలనే వ్యూహంపై బుధవారం నాటి భేటీలో స్పష్టత రానుంది. గత వారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు పవన్‌ కల్యాణ్‌తో సమావేశమై పొత్తుపై ప్రాథమిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.