LOADING...
మహిళలను గౌరవించకపోతే దేశం పురోగమించదు.. బీజేపీ అధికార దాహంతో ఆటలాడుతోంది: రాహుల్ గాంధీ
బీజేపీ అధికార దాహంతో ఆటలాడుతోంది : రాహుల్ గాంధీ

మహిళలను గౌరవించకపోతే దేశం పురోగమించదు.. బీజేపీ అధికార దాహంతో ఆటలాడుతోంది: రాహుల్ గాంధీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 28, 2023
06:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ అధికార దాహంతో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించని దేశం ఎప్పటికీ పురోగమించదని పేర్కొన్నారు. కేంద్రంలోని భాజపా మహిళల గౌరవం, భారత్ ఆత్మగౌరవంతో ఆటలాడుతోందని మండిపడ్డారు. ఈ మేరకు మణిపూర్ లైంగిక ఘటనలు, డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఓ వీడియోను రూపొందించారు. ఇదే వీడియోలో ఉత్తరాఖండ్ లోని ఓ బీజేపీ నేత కుమారుడి ప్రమేయం నేపథ్యంలో బాధితురాలి హత్య, బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషుల విడుదల వంటి అంశాలకు సంబంధించి ఇన్‌స్టాలో వీడియోను పంచుకున్నారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

మహిళలపై నేరాలకు సంబంధించి వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ