Page Loader
మణిపూర్ అమానుష వైరల్ వీడియో కేసు సీబీఐ చేతికి.. సుప్రీంకు కేంద్రం వివరణ
మణిపూర్ అమానుష వీడియో కేసు సీబీఐ చేతికి

మణిపూర్ అమానుష వైరల్ వీడియో కేసు సీబీఐ చేతికి.. సుప్రీంకు కేంద్రం వివరణ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 28, 2023
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌ అమానుష కేసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్‌గా మారడంపై విచారణ నిమిత్తం సదరు కేసును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రహోం శాఖ వివరించింది. మే 4న ఈశాన్య రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు కోసం సీబీఐ(CBI)కి కేంద్ర ప్రభుత్వం కేసును అప్పగించింది. ఈ కేసుపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం, సదరు కేసును విచారణ కోసం మణిపూర్ వెలుపలికి బదిలీ చేయాలని సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఆయా వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

details

మణిపూర్‌లో రెండు తెగలతో కేంద్రం శాంతి చర్చలు

అస్సాంలోని కోర్టు వైరల్ వీడియో కేసుపై విచారణను చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. నగ్న ఊరేగింపు వీడియో తీసిన సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్‌లో కుకీ,మైతీ తెగల మధ్య ఘర్షణలకు సీఎం బీరేన్ సింగ్ వైఖరే కారణమని సీపీఎం ఆరోపించింది. కుల రాజకీయాలతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారాని మండిపడింది. మరోవైపు బాధిత రాష్ట్రంలో ప్రత్యక్ష పరిస్థితులను తెలుసుకునేందుకు విపక్షాలకు చెందిన ఎంపీలు శని, ఆదివారాల్లో మణిపూర్‌లో పర్యటించనున్నారు. కేంద్రప్రభుత్వ వర్గాలు ఈ రెండు తెగల పెద్దలతో అనేక దఫాలుగా చర్చిస్తున్నాయి.ప్రతీ సంఘంతో 6 రౌండ్ల మేర చర్చలు నిర్వహించారు.శాంతిని పునరుద్ధరించేందుకు హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు మణిపూర్‌లో 35 వేల అదనపు బలగాలను మోహరించింది.