Paracetamol: సీడీఎస్సీఓ హెచ్చరిక.. భారతదేశంలో పారాసెటమాల్ సహా 52 మందులు నాణ్యతలో విఫలం
భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఇటీవల 52 మందులకు సంబంధించి "నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ" (ఎన్‌ఎస్‌క్యూ) హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర ఔషధ అధికారులు నిర్వహించిన యాదృచ్ఛిక నమూనా పరీక్షల ఫలితాలపై ఈ హెచ్చరిక విడుదలైంది. ఈ జాబితాలో పారాసెటమాల్ IP 500mg, గ్లిమెపిరైడ్ వంటి యాంటీ-డయాబెటిక్ మందులు, పాన్-డి వంటి యాంటీ యాసిడ్‌లు, విటమిన్ సి, డి3 మాత్రలు వంటి ప్రాచుర్యం పొందిన మందులు కూడా విశేషం. ఉన్నాయి. ఈ మందులను హెటెరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ (HAL), కర్ణాటక యాంటీబయాటిక్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వంటి ప్రముఖ ఔషధ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి.
మెట్రోనిడాజోల్ లో కూడా నాణ్యత లేదని నిర్ధారణ?
కడుపు ఇన్ఫెక్షన్లకు వాడే మెట్రోనిడాజోల్ కూడా నాణ్యత లోపంతో ఉన్నట్టు గుర్తించారు. కోల్‌కతా లేబొరేటరీ అల్‌కెమ్ హెల్త్ సైన్స్ యాంటీబయోటిక్ మందులు క్లావమ్ 625, పాన్ డిలను నకిలీగా గుర్తించింది. హెటెరోస్ సిపోడెమ్ XP 50 డ్రై సస్పెన్షన్, పిల్లలకు సూచించిన తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో వాడే మందు నాణ్యత తగినంతగా లేదని పరీక్షలో తేలింది. అదే విధంగా కర్ణాటక యాంటీబయాటిక్స్ తయారు చేసిన పారాసెటమాల్ మాత్రలు కూడా నాణ్యత లేదని తేలినట్లు సమాచారం. ఆగస్టులో CDSCO 156 ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ మందులను నిషేధించింది, ఇందులో జ్వర నివారణ మందులు, నొప్పి నివారణలు, అలెర్జీ మాత్రలు కూడా ఉన్నాయి.