తదుపరి వార్తా కథనం

Vrindavan Temple: ఐఫోన్‌ను ఎత్తుకెళ్లిన కోతి.. ఏం ఇస్తే తిరిగి ఇచ్చిందంటే!
వ్రాసిన వారు
Stalin
Jan 17, 2024
06:29 pm
ఈ వార్తాకథనం ఏంటి
మధుర బృందావన్‌లోని శ్రీ రంగనాథ్ జీ ఆలయానికి వచ్చిన భక్తుని ఐఫోన్‌ను కోతి ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వికాస్ అనే వ్యక్తి సోషల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.
రెండు కోతులు భవనం పైన కోర్చోగా.. అందులో ఒక కోతి ఐఫోన్‌ను పట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
ఐఫోన్‌ను ఎత్తికెళ్లిన కోతి.. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది తిరిగి ఇవ్వలేదు. చివరికి ఓ వ్యక్తి.. ఫ్రూటీ ప్యాకెట్‌ను కోతి వైపు విసరగా.. అది వెంటనే ఐఫోన్‌ను వదిలిపెట్టింది.
కింద ఉన్న వారిలో ఒకరు చాకచక్యంగా ఫొన్‌ను క్యాచ్ పట్టారు. దీంతో కథ సుఖంతమైంది.
'దీన్నే వస్తు మార్పిడి అంటారు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.