Hitech city: హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌కు నూతన రూపం.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రజలకు అంకితం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశంలోని 20 రాష్ట్రాల్లో ఆధునికీకరించిన 75 రైల్వేస్టేషన్‌లను పంజాబ్‌లోని జలంధర్ రైల్వేస్టేషన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి ప్రారంభించారు. తెలంగాణ తరఫున ఈ జాబితాలో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌కు చోటు దక్కింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్. రెడ్డి మాట్లాడుతూ, సాధారణ ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వేలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
వివరాలు
విజేతలకు బహుమతులు..
కార్యక్రమంలో భాగంగా ఆరు పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలలో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు.
అలాగే సెల్ఫీ పోటీలో విజయం సాధించిన వారిని కూడా సత్కరించారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్‌తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.