Suresh Gopi: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.38.41 లక్షల కోట్ల ఆదాయం
పెట్రో ఉత్పత్తులపై విధించే పన్నులు, సుంకాలు ద్వారా ఐదు సంవత్సరాల, ఆరు నెలల సమయంలో కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 38,41,573 కోట్లు ఆదాయం అందిందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి సురేశ్ గోపి పేర్కొన్నారు. ఆయన గురువారం లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఆదాయంలో రూ. 23,25,467 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు, రూ. 15,16,106 కోట్లు రాష్ట్రాల ఖజానాలకు చేరాయని తెలిపారు. అలాగే, కేంద్ర ఖజానాకు చేరిన మొత్తం ఆదాయంలో అత్యధికమైనది ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చిన రూ. 16,43,098 కోట్లు (70.65%) అని ఆయన వివరించారు.