Page Loader
Income Tax Raids: త‌నిఖీల‌కు వెళ్లిన ఆదాయ‌ప‌న్ను శాఖకు షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బంగారం,న‌గ‌దుతో పాటు మొస‌ళ్లు 
త‌నిఖీల‌కు వెళ్లిన ఆదాయ‌ప‌న్ను శాఖకు షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బంగారం,న‌గ‌దుతో పాటు మొస‌ళ్లు

Income Tax Raids: త‌నిఖీల‌కు వెళ్లిన ఆదాయ‌ప‌న్ను శాఖకు షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బంగారం,న‌గ‌దుతో పాటు మొస‌ళ్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా అధికారులకు అవాక్కయ్యే అంశాలు బయటపడ్డాయి. బంగారం, కోట్ల నగదు, బినామీ కార్లతో పాటు ఇంట్లో మూడు మొసళ్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. రాథోడ్‌తో పాటు మాజీ కౌన్సిలర్ రాజేష్ కేశర్వాని నివాసాల్లో కూడా ఆదివారం నుంచి ఐటీ శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు ₹155 కోట్ల పన్ను ఎగవేశారని అనుమానం వ్యక్తమవుతోంది. రాథోడ్ ఇంట్లో నుంచి ₹3 కోట్ల నగదు, బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు, వీటి విలువ కోట్లలో ఉంటుందని అంచనా.

వివరాలు 

బీడీ వ్యాపారం చేస్తున్న రాథోడ్, కేశర్వాని  

రాథోడ్, కేశర్వాని ఇద్దరూ బీడీ వ్యాపారం చేస్తున్నారు. కేశర్వాని సుమారు ₹140 కోట్ల పన్ను ఎగవేశారని సమాచారం. దీనికి సంబంధించిన పత్రాలను ఐటీ సోదాల్లో గుర్తించారు. కేశర్వాని నిర్మాణ రంగ వ్యాపారంలో కూడా ఉన్నాడు. మరోవైపు, రాథోడ్ ఇంట్లో అధికారులను ఆశ్చర్యపరిచే అంశం మూడు మొసళ్లు.. ఇంట్లో ఉన్న ఒక చిన్న కుంటలో ఇవి ఉండటం గుర్తించారు. ఈ విషయం వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు.

వివరాలు 

2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా..

కేశర్వాని ఇంట్లో పలు బినామీ దిగుమతి కార్లను గుర్తించారు. ఒక్క కారూ కూడా కేశర్వాని కుటుంబం పేరుతో రిజిస్టర్ కాలేదు. ట్రాన్స్‌పోర్ట్ శాఖ నుంచి కార్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ, వాటిని ఎలా కొనుగోలు చేశారనే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. సాగర్ జిల్లాలో రాథోడ్ తన వ్యాపారాన్ని ప్రారంభించి, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన జిల్లా చీఫ్ పోస్టుకు కూడా పోటీ చేశారు. రాథోడ్ తండ్రి హర్నమ్ సింగ్ రాథోడ్ గతంలో మధ్యప్రదేశ్ మంత్రిగా పనిచేశారు.