LOADING...
Intel set Guinness world: ఇంటెల్‌తో కలిసి ఇండియా ఏఐ మిషన్‌ గిన్నిస్‌ రికార్డు
ఇంటెల్‌తో కలిసి ఇండియా ఏఐమిషన్‌ గిన్నిస్‌ రికార్డు

Intel set Guinness world: ఇంటెల్‌తో కలిసి ఇండియా ఏఐ మిషన్‌ గిన్నిస్‌ రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని ఇండియా ఏఐ మిషన్‌, ఇంటెల్‌ ఇండియాతో కలిసి 24 గంటల్లో అత్యధికంగా ఏఐ బాధ్యతపై ప్రతిజ్ఞలు సేకరించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. ఫిబ్రవరి 16 ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ దేశవ్యాప్త కార్యక్రమం ద్వారా నైతికత,నమ్మకం, సమగ్రత,బాధ్యత, తప్పుడు సమాచార నియంత్రణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియా ఏఐ మిషన్‌ కింద MeitY ఈ క్యాంపెయిన్‌ను అమలు చేయగా,ప్రత్యేక డిజిటల్‌ పోర్టల్‌ ద్వారా ప్రజలు సులభంగా ప్రతిజ్ఞ చేయే అవకాశం కల్పించారు. ఇందులో కెమెరా, మైక్ అవసరం లేకుండా, అర్హత పరిమితులు లేకుండా, వయసు లేదా విద్యతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించారు.

వివరాలు 

ఏఐ బాధ్యతపై ప్రజల భాగస్వామ్యానికి పెద్ద అడుగు

ప్రతిజ్ఞ చేసే ముందు చిన్న చిన్న పరిస్థితుల ఆధారిత ప్రశ్నలతో అవగాహన కల్పించి, చివరగా ఏఐ బాధ్యత ప్రతిజ్ఞ చేయించడంతో పాటు డిజిటల్‌ గౌరవ బ్యాడ్జ్‌,ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏఐ లెర్నింగ్‌ మార్గాలు అందిస్తున్నారు. విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, పరిశ్రమల ప్రతినిధులు, స్టార్టప్‌లు సహా అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏఐ బాధ్యత ప్రతిజ్ఞ కార్యక్రమం 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్‌ మండపంలో జరగనున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026లో ప్రజల భాగస్వామ్యానికి కీలక స్థంభంగా ఉండనుందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement