Page Loader
AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్
AAP: అర్హుత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్

AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్

వ్రాసిన వారు Stalin
Feb 13, 2024
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

Lok Sabha Election: ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి ఆప్ మరో షాకిచ్చింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ (Delhi)లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే ఇవ్వనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ఆప్ నేత సందీప్ పాఠక్ మంగళవారం మాట్లాడుతూ.. దిల్లీలో తమ ప్రభుత్వం అధికారంలో ఉంది. మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ తాను మెజార్టీ సంఖ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణాలను బట్టి తాము 6 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నామని, కాంగ్రెస్‌కు 1 సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెరిట్‌ ఆధారంగా చూస్తే.. కాంగ్రెస్‌ పార్టీకి దిల్లీలో ఒక్క సీటు కూడా దక్కదని, అయితే కూటమి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక సీటును ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

కాంగ్రెస్

కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు: సందీప్ పాఠక్ 

కాంగ్రెస్ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేదని, అసెంబ్లీలో కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని, MCD ఎన్నికల్లో 250 సీట్లలో కేవలం తొమ్మిది మాత్రమే హస్తం పార్టీ గెల్చుకున్నట్లు సందీప్ పాఠక్ చెప్పారు. ఈ లెక్క ప్రకారం ఒక్క సీటులో కూడా పోటీ చేసే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంపకానికి సంబంధించి రెండు సమావేశాలు నిర్వహించామన్నారు. అయితే ఈ సమావేశాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదన్నారు. తాము తదుపరి సమావేశం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇటీవల తాము అసోంలో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామని, వారిని ఇండియా కూటమి అంగీకరిస్తుందని తాను ఆశిస్తున్నట్లు సందీప్ పాఠక్ పేర్కొన్నారు.