Arunachal Pradesh: చైనాకు భారత్ కౌంటర్.. అరుణాచల్‌లో 27 ప్రాంతాలకు కొత్త పేర్లు
ఈ వార్తాకథనం ఏంటి
అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రాంతాలకు భారత్ కొత్త పేర్లను ఖరారు చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు చైనా వరుసగా పేర్లు పెడుతున్న నేపథ్యంలో.. దానికి ప్రతిస్పందనగా భారత్ కూడా కీలక చర్య చేపట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌కు సంబంధించిన సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో 27 ప్రాంతాలను గుర్తించి, వాటికి కొత్త పేర్లను నమోదు చేసింది. స్థానికులు సులభంగా గుర్తించే విధంగా ఆయా ప్రాంతాలకు పేర్లు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా ఏకపక్షంగా పేర్లు పెట్టడాన్ని భారత్ గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు తాజా మ్యాప్‌లో భారత్ కూడా ఆయా ప్రాంతాలకు అధికారికంగా పేర్లు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
లాంగ్‌జూ, మాజా ప్రాంతాలకు చోటు
భారత్ కొత్తగా గుర్తించిన ప్రాంతాల జాబితాలో వాస్తవాధీన రేఖ (LAC) వెంట ఉన్న లాంగ్‌జూ కూడా ఉంది. 1959లో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలకు ఈ ప్రాంతం వేదికగా నిలిచింది.
అప్పట్లో చైనా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించాయి. లాంగ్‌జూకు సమీపంలోని మాజా గ్రామాన్ని కూడా కొత్త మ్యాప్‌లో గుర్తించారు.
ఇది అరుణాచల్‌ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్‌సిరి జిల్లాలో ఉంది. అలాగే పర్వత ప్రాంతాల్లోని జో లా, రిజా లా, పుకుర్ లా, బిసా గ్రామాలను కూడా కొత్త జాబితాలో చేర్చారు.
వివరాలు
1962 యుద్ధ ప్రాంతం కూడా గుర్తింపు
హై ఆల్టిట్యూడ్ పాసేజ్‌లో ఉన్న థాగ్ లా ప్రాంతానికి కూడా తాజా మ్యాప్‌లో అధికారిక గుర్తింపు లభించింది. 1962లో భారత్, చైనా మధ్య జరిగిన యుద్ధంలో ఈ ప్రాంతం కీలకంగా నిలిచింది.
ప్రస్తుతం థాగ్ లాను కూడా కొత్తగా గుర్తించిన ప్రాంతాల జాబితాలో చేర్చారు. అదేవిధంగా చాంగ్‌లాంగ్ జిల్లాలోని జైరాంపూర్ ప్రాంతానికి కూడా కొత్త మ్యాప్‌లో చోటు కల్పించారు.
వివరాలు
కొత్త జాబితాలోని ప్రాంతాలు
భారత్ కొత్తగా గుర్తించిన 27 ప్రాంతాల్లో సాంబో సరోవర్, బారా కుందన్, చోటా కుందన్, దాన్ బారి, ప్రిత్‌నగర్, తెరిత్నగర్, రామ్‌నగర్, జశ్వంత్ ఘర్, సాగర్, పద్మ, జ్యోతినగర్, బైసాకి ఉన్నాయి.
అలాగే షేర్ ఏ తప్పా స్మారక, చోటా రూపక్, బారా రూపక్, శివాజీ నగర్, సున్‌పురా, కమలాంగ్ నగర్, కమలాంగ్ సాంక్చువరీ, బుద్ధామందిర్ ప్రాంతాలను కూడా కొత్త జాబితాలో చేర్చారు.
వివరాలు
అరుణాచల్‌ను 'జాంగ్‌నాన్'గా పిలుస్తున్న చైనా
అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో భారత్, చైనా మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది.
అరుణాచల్‌ప్రదేశ్ తమ భూభాగంలో భాగమని చైనా వాదిస్తూ.. ఆ రాష్ట్రాన్ని 'జాంగ్‌నాన్' అని పిలుస్తోంది.
అక్కడి పలు ప్రాంతాలకు చైనా ఏకపక్షంగా పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని 27 ప్రాంతాలను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో అధికారికంగా గుర్తించి, స్థానికంగా ప్రాచుర్యంలో ఉన్న పేర్లను నమోదు చేయడం చైనాకు భారత్ ఇచ్చిన మరో కౌంటర్‌గా భావిస్తున్నారు.