LOADING...
UN Human Rights Council : ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నికైన భార‌త్
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నికైన భార‌త్

UN Human Rights Council : ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నికైన భార‌త్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC)కి భారతదేశం ఏడోసారి ఎన్నికైంది. 2026 నుండి 2028 వరకు భారతదేశం UNHRC సభ్యదేశంగా కొనసాగనుంది. మంగళవారం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. భారతదేశానికి చెందిన మూడేళ్ల పదవీకాలం 2026జనవరి 1 నుండి ప్రారంభమవుతుందని UNHRC తన సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ కూడా స్పందించారు. భారత్ కు మద్దతు ఇచ్చిన వారందరికీ ఆయన తన సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఏడోసారి మానవహక్కుల మండలి సభ్యంగా ఎన్నికైన విషయాన్నిఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. తమ పదవీకాలంలో మానవ హక్కుల రక్షణ కోసం భారతదేశం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం UNమానవ హక్కుల మండలిలో మొత్తం 47సభ్యదేశాలు ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పర్వతనేని హరీశ్ చేసిన ట్వీట్