Narendra Modi: కొత్త సాంకేతికత స్వీకరణలో భారత్ ముందంజ: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. కృత్రిమ మేధ (Artificial Intelligence) వినియోగంపై దేశ యువత ఉత్సాహంగా ముందుకు వస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు' (India AI Impact Summit)లో గురువారం పాల్గొన్న ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, మానవ అభివృద్ధి ప్రయాణంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు.Embed
వివరాలు
ఏఐ సాంకేతికతను సమానంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి: మోదీ
ఏఐ ఒక శక్తివంతమైన మార్పు సాధనమని ఆయన వ్యాఖ్యానించారు. దాన్నితప్పుగా వినియోగిస్తే నష్టాలకు దారితీసే ప్రమాదం ఉందని,అయితే సమర్థంగా ఉపయోగిస్తే అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను చూపగలదని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ఏమి చేయగలదన్నదానికంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ సామర్థ్యాలను మనం ఎలా ఉపయోగించుకుంటామన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమం, శ్రేయస్సు అనే ప్రమాణాలనే ఏఐ వినియోగానికి ఆధారంగా తీసుకోవాలని ప్రధాని సూచించారు. మనుషులు కేవలం డేటా గణాంకాలుగా లేదా ముడి వనరులుగా మారిపోకుండా ఉండాలంటే, ఏఐ సాంకేతికతను సమానంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధ మనల్ని నియంత్రించే స్థితి రాకుండా, మనమే దాన్ని సమర్థంగా నియంత్రించాలి అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రజల శ్రేయస్సే ఏఐకి అసలు ప్రమాణం: మోదీ
Listen to Hon'ble Prime Minister Shri @narendramodi share his vision for AI at his inaugural address, welcoming the global leaders at the #IndiaAIImpactSummit2026
— Digital India (@_DigitalIndia) February 19, 2026
He outlined the need to anchor AI from machine-centric to human-centric and termed it as one of the core objectives… pic.twitter.com/KFNK5JwsB3