LOADING...
Tirumala: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్
తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్

Tirumala: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతి రోజు వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుతుంటారు. భక్తుల రద్దీ, భద్రత,వసతిని సమర్థవంతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త సాంకేతికతను అవలంబించనుంది. ప్రత్యేకంగా, ఎన్‌ఆర్‌ఐల విరాళాలతో దేశంలో మొదటిసారిగా తిరుమలలో ఏఐ ఆధారిత "ఇంటిగ్రేటెడ్ కమాండ్‌ కంట్రోల్ సెంటర్" (ఐసీసీసీ) ప్రారంభం కానుంది. ఇది వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత వంటి అంశాలపై సమగ్రమైన చర్యలు తీసుకోవడం సులభం అవుతుంది. ఈ ఐసీసీసీని ఈ నెల 25వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ వివరాలను తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి 'ప్రముఖ మీడియా'కి వెల్లడించారు.

వివరాలు 

ఐసీసీసీ విధానం ఎలా పనిచేస్తుందంటే: 

ఈ కేంద్రంలో పెద్ద డిజిటల్ స్క్రీన్‌లపై అన్ని విభాగాలకు చెందిన సీసీటీవీ ఫుటేజీలు లైవ్‌గా చూడవచ్చు. వీటిని 25 మందికిపైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ, భక్తుల పరిస్థితులను అధికారులకు తెలియజేస్తారు. ఇప్పటివరకు ఉన్న కెమెరాలతో పాటు, కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలు అలిపిరి వద్దనుంచి భక్తుల రద్దీని ఏఐ ద్వారా అంచనా వేస్తాయి. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు? ఎంత సమయంగా వారు నిరీక్షిస్తున్నారు? సర్వదర్శనం పరిస్థితి.. తదితర అంశాలను ఏఐ ట్రాక్‌ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తులను గుర్తించడం, చోరీలు లేదా ఇతర అవాంఛనీయ ఘటనలను కనుగొనడం, తప్పిపోయిన వ్యక్తుల స్థానాన్ని తెలుసుకోవడం వీటిలో భాగం. భక్తుల ముఖభావాలు, కదలికల ఆధారంగా వారి ఇబ్బందులను గుర్తించడంలో ఐసీసీసీ సహాయపడుతుంది.

వివరాలు 

ఐసీసీసీ విధానం ఎలా పనిచేస్తుందంటే: 

క్యూలైన్‌లు, వసతి, ఇతర సౌకర్యాల సమాచారం 3డి మ్యాప్‌లు, చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాలను రెడ్ స్పాట్లుగా చూపడం ద్వారా తగిన చర్యలకు సంకేతం ఇస్తుంది. అదేవిధంగా, కేంద్రం ఆన్‌లైన్ పర్యవేక్షణ, సైబర్ దాడుల నివారణ, తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసే సోషల్ మీడియాలోని అనుచిత పోస్టులు, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడంలో సహాయపడుతుంది. ఈ సాంకేతికత ద్వారా భక్తుల అనుభవాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేయడం లక్ష్యం. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షితంగా బయటకు తీసుకెళ్ళే సమీప మార్గాలను కూడా సూచిస్తుంది.