Page Loader
India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు 
India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు

India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు 

వ్రాసిన వారు Stalin
Jan 08, 2024
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

Maldivian envoy visit: భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్‌ను పిలిపించింది. లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకర వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం తెలిపింది. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అలాగే మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్‌‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ విషయాన్ని మాల్దీవుల ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. మోదీ వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విదేశాంగ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న  మాల్దీవుల రాయబారి