
India hits JACKPOT: భారత్ జాక్‌పాట్? భారీ బంగారు నిక్షేపాలను గుర్తించిన జీఎస్‌ఐ
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలోని సిహోర తాలూకా పరిధిలో బేలా,బినైకా అనే గ్రామాల మధ్య బంగారు నిక్షేపాల ఉనికిని గుర్తించారు. నిపుణులు ఆ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించి, మట్టి నమూనాలను సేకరించి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చిన్న చిన్న బంగారు కణాలు, ఇతర లోహాలు లభించాయనే విషయాన్ని ధృవీకరించారు. ప్రాథమిక సర్వే ఫలితాల ప్రకారం,ఈ బంగారు నిక్షేపాలు సుమారు 100 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండి, వాటి మొత్తం లక్షల టన్నుల బంగారానికి తగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనా సరిగా నిర్ధారితమైతే, జబల్పూర్ జిల్లా దేశంలోని అత్యంత ఖనిజ సంపదగల ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు.
వివరాలు
మధ్యప్రదేశ్‌లో 40 కంటే ఎక్కువ ప్రాజెక్టులపై పని
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI)డైరెక్టర్ జనరల్ ఆసిత్ సహా మాట్లాడుతూ.. "ఇక్కడ బంగారంతో సంబంధం ఉన్న చిన్న కణాలు ఉన్నప్పటికీ,ప్రస్తుతం పెద్ద స్థాయి గని లేదా విస్తృత నిక్షేపం ఉందని చెప్పడం కష్టమే. అసలు ఎవరైతే తవ్వకాలు నిర్వహిస్తారో వారు కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, ఈ ప్రాంతంలో తవ్వడం లాభదాయకమో కాదో అర్థం చేసుకోవడానికి ఇంకా సమయం అవసరం.మట్టి నమూనాల్లో బంగారపు ఆనవాళ్లు కనిపించినప్పటికీ, పూర్తి స్థాయి పరిశోధనలు ఇంకా చేయవలసి ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం GSI మధ్యప్రదేశ్ లో 40కి పైగా ప్రాజెక్టులపై పని చేస్తుండగా,జబల్పూర్ ప్రాంతం వాటిలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ ప్రాంతం భౌగోళికంగా సంపన్నమైనదని,గతంలో కూడా విలువైన ఖనిజాలు అందులో దొరికిన విషయాన్ని గుర్తుచేశారు.
వివరాలు
పెద్ద పరిమాణంలో బంగారం ఉన్నప్పుడే తవ్వకాలు
గ్రామ సర్పంచ్ రామ్ రాజ్ పటేల్ మాట్లాడుతూ..తమ భూమిలో బంగారు కణాలు దొరికాయని తెలిసిన వెంటనే గ్రామస్థులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారని చెప్పారు. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాన్ని అనేక మంది సందర్శించేందుకు వెళ్లారని చెప్పారు. ఇక్కడ బంగారు తవ్వకాలు మొదలైతే ఉద్యోగాలు, మంచి రహదారులు, విద్యుత్, మరిన్ని సౌకర్యాలు వస్తాయని ఇప్పుడు గ్రామస్థుల్లో ఆశలు మొదలయ్యాయి" అని అన్నారు. బంగారం తవ్వడానికి ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల, ఆ ఖర్చులను మించిపోయే పరిమాణంలోనే తవ్వకాలు ప్రారంభిస్తారు. ప్రస్తుతం జబల్పూర్ ప్రాంతంలోని ఈ ఖనిజ సంపదపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.