LOADING...
PM Modi: దాతృత్వం, సేవలో భారత్‌ ముందుంది.. ఛత్తీస్‌గఢ్ రజత్‌ మహోత్సవంలో నరేంద్ర మోదీ
దాతృత్వం, సేవలో భారత్‌ ముందుంది.. ఛత్తీస్‌గఢ్ రజత్‌ మహోత్సవంలో నరేంద్ర మోదీ

PM Modi: దాతృత్వం, సేవలో భారత్‌ ముందుంది.. ఛత్తీస్‌గఢ్ రజత్‌ మహోత్సవంలో నరేంద్ర మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2025
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా లేదా ప్రకృతి విపత్తులు సంభవించినా సాయమందించడంలో ఎల్లప్పుడూ భారతదేశం ముందుండుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఛత్తీస్‌గఢ్ రజత్ మహోత్సవం'లో ఆయన ముఖ్య అతిథిగా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ నవ రాయ్‌పూర్‌లో ఆధ్యాత్మిక అభ్యాసం, ధ్యానం, శాంతి కోసం బ్రహ్మ కుమారీల సంస్థ నిర్మించిన ఆధునిక కేంద్రమైన 'శాంతి శిఖర్'ను ప్రారంభించారు. అనంతరం సభలో మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా విపత్తు జరిగినప్పుడు భారతదేశం విశ్వసనీయ భాగస్వామిగా, మొదటి స్పందన ఇచ్చే దేశంగా నిలుస్తుంది. మానవతా సేవలో ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.

Details

ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత

ప్రకృతి పరిరక్షణ ప్రాధాన్యతపై మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి సంరక్షణకు భారతదేశం ప్రముఖ స్వరంగా మారింది. ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత. మనం ప్రకృతితో సామరస్యంగా జీవిస్తేనే భవిష్యత్తు సురక్షితం అవుతుందని ప్రధాని స్పష్టం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూ. 14,260 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను, షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నం, గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం పుట్టుకతో గుండె వ్యాధులతో చికిత్స పొందుతున్న పిల్లలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. చివరగా ఛత్తీస్‌గఢ్ కొత్త విధానసభ భవనాన్ని ప్రారంభించి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.