LOADING...
Ebola: ఎబోలా అలర్ట్.. కేంద్రం కీలక సూచనలు జారీ
ఎబోలా అలర్ట్.. కేంద్రం కీలక సూచనలు జారీ

Ebola: ఎబోలా అలర్ట్.. కేంద్రం కీలక సూచనలు జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2026
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా తదితర దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాలను సందర్శించిన వారు లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించి భారత్‌కు చేరుకున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచించింది. అలాంటి ప్రయాణికులు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనించుకోవడంతో పాటు అవసరమైతే స్వీయ నిర్బంధంలో ఉండాలని పేర్కొంది.

వివరాలు 

ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచన

ఎబోలా ప్రభావిత దేశాలను సందర్శించిన వారు లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించి భారత్‌కు చేరుకున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచించింది. అలాంటి ప్రయాణికులు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనించుకోవడంతో పాటు అవసరమైతే స్వీయ నిర్బంధంలో ఉండాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో ఎక్కడా ఎబోలా కేసులు నమోదుకాలేదని స్పష్టం చేసింది. అయితే గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చినవారు లేదా ఆ ప్రాంతాల మీదుగా ప్రయాణించినవారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించింది.

వివరాలు 

హెల్ప్‌లైన్ నంబర్

అలాగే ఆరోగ్య అధికారులకు తక్షణమే సమాచారం అందించాలని తెలిపింది. ముందుగానే సమాచారం ఇవ్వడం ద్వారా బాధితుల ఆరోగ్య రక్షణతో పాటు వైరస్ వ్యాప్తిని కూడా అరికట్టే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఎబోలా సంబంధిత అనుమానాలు లేదా సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 1075 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.

Advertisement