LOADING...
India in Iran: తక్షణమే ఇరాన్‌ను వీడండి.. భారత్‌ పౌరులకు కేంద్రం అడ్వైజరీ
తక్షణమే ఇరాన్‌ను వీడండి.. భారత్‌ పౌరులకు కేంద్రం అడ్వైజరీ

India in Iran: తక్షణమే ఇరాన్‌ను వీడండి.. భారత్‌ పౌరులకు కేంద్రం అడ్వైజరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2026
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ దేశంలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఆ దేశం నుంచి వీలైనంత త్వరగా బయటకు రావాలని భారత పౌరులకు సూచించింది. ఈ విషయాన్ని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమ వేదికలో వెల్లడించింది. కేంద్రం సూచనల మేరకు అక్కడి భారతీయులు వెంటనే జాగ్రత్తలు తీసుకుని దేశం విడిచి వెళ్లాలని కోరింది. రాయబార కార్యాలయంతో సంప్రదింపులు లేకుండా అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు పలు ఫోన్ నంబర్లు అందించింది. అవి +989128109115; +989128109109; +989128109102; +989932179359. అలాగే మెయిల్ చిరునామా కూడా అందుబాటులో ఉంచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం తాజా హెచ్చరిక

వివరాలు 

రెండు వారాల పాటు కాల్పుల విరమణ

అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉండటంతో కేంద్రం వరుసగా సూచనలు జారీ చేస్తోంది. అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని, ఇళ్లలోనే ఉండాలని సూచించింది. విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, ఎత్తైన భవనాలకు దూరంగా ఉండాలని తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఈ హెచ్చరికను పునరుద్ఘాటించింది.

Advertisement