NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ 
    రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం

    INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    12:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ దాడులతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ప్రత్యర్థి దేశంలోకి నేరుగా చొచ్చుకెళ్లి భారీస్థాయిలో దాడులు చేసింది.

    ఈ క్రమంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సముద్రంలో నౌకాదళం రంగంలోకి దింపగా, భారత నౌకాదళం కరాచీ సముద్ర పోర్టుపై తీవ్రంగా విరుచుకుపడింది.

    ఈ దాడుల్లో కరాచీ పోర్టులో దాదాపు పది భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. భారత మిస్సైల్ దాడుల వల్ల అక్కడ ఉన్న అనేక కంటైనర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

    కరాచీ పోర్ట్ పాకిస్తాన్‌కు వ్యాపారపరంగా అత్యంత కీలకమైనది. పాక్‌ మొత్తం వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా అక్కడి నుంచే నడుస్తాయి.

    ఇతర దేశాలతో జరిపే వ్యాపారం కూడా కరాచీ పోర్ట్ ద్వారానే సాగుతుంది. అలాంటి ముఖ్యమైన పోర్ట్‌పై భారత నౌకాదళం విరుచుకుపడి, దాదాపు పూర్తిగా ధ్వంసం చేసింది.

    వివరాలు 

    అపప్రమత్తమైన భారత సైన్యం 

    పాకిస్తాన్ కూడా ఓ పక్క సమర్థించుకోలేని స్థితిలో దూకుడుగా వ్యవహరించింది. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడటమే కాకుండా,భారత్‌పై తీరని దాడులకు పాల్పడింది.

    జమ్మూ ప్రాంతంలో ఉన్న ఎయిర్ పోర్ట్‌తో పాటు ఇతర ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది.

    అంతర్జాతీయ సరిహద్దు దాటి రాత్రి సమయంలో జమ్మూపై రాకెట్లు ప్రయోగించింది.

    దీంతో భారత సైన్యం వెంటనే అప్రమత్తమైంది. దీనికి ప్రతిస్పందనగా, భారత ఫైటర్ జెట్లు దూసుకెళ్లాయి.

    భారత వైమానిక దళాలు తమ రక్షణ వ్యవస్థలను యాక్టివ్ చేసి, పాకిస్తాన్ నుంచి వచ్చిన రాకెట్లను సమర్థవంతంగా అడ్డుకున్నాయి.

    పాక్ పంపిన డ్రోన్లు,జెట్లు, మిస్సైళ్లను భారత రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చేశాయి.

    వివరాలు 

    పాక్ పంపిన మిస్సైల్‌లు, డ్రోన్లు కూల్చేసిన భారత సైన్యం 

    గురువారం సాయంత్రం సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, పూంఛ్, సాంబా, ఉరి జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం ఉద్ధేపోనిగా ప్రవర్తించింది.

    అంతేకాక, అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ వంటి కీలక సైనిక స్థావరాలను కూడా పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది.

    అక్కడికీ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. అయితే భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరించి ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.

    పాక్ పంపిన మిస్సైల్‌లు, డ్రోన్లు భారత సైన్యం కూల్చేసింది.

    ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ప్రారంభించిన "ఆపరేషన్ సిందూర్" ప్రారంభమైన 48 గంటల్లోపే, పాకిస్తాన్ భారత్‌పై ప్రత్యక్ష దాడులకు దిగింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రంగంలోకి INS విక్రాంత్

    Operation Sindoor 3.0 begins.

    Karachi Port DESTROYED!

    Entire port is in ashes.

    In 1971, the port was burning for entire week!

    INS Vikrant ❗🔥❗🔥#OperationSindhoor #IndiaPakistanWar #IndianArmy #Lahore #Karachi #IndianArmy #IndianArmy pic.twitter.com/rWpbwBevbF

    — Mohan J (@MohanMohz) May 8, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Fact Check: ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దు: భారత రక్షణశాఖ రక్షణ
    civil aviation: భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు విమానాశ్రయం
    BCCI: ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా తరలించనున్న బీసీసీఐ బీసీసీఐ

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025