Arunchal Padesh Row: చైనా చర్యలు అర్థ రహితం: భారత్
ఈ వార్తాకథనం ఏంటి
పొరుగు దేశం చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేస్తోన్న విస్తుగొలిపే చర్యలు అర్థరహితమైనవని భారత్ పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను చైనా పేర్లు పెట్టి జాబితా విడుదల చేయడం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలను చైనా కనుగొని పేర్లు పెట్టి విడుదల చేసిన నాల్గవ జాబితాను భారత్ తోసిపుచ్చింది.
ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.ఇలా పేర్లుపెట్టి జాబితాలను విడుదల చేసి వాస్తవాలను మార్చలేరని భారత్ పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్లోని ఆ ప్రాంతాలు ఎప్పట్నుంచో ఉన్నవేనని, ఎప్పటికీ ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Arunchala pradesh
అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే
అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేని రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు.అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం అర్థం లేని చర్యగా ఆయన అభివర్ణించారు.
చైనాలోని అధికార కేంద్రమైన బీజీంగ్ పదే పదే తన విపరీత చర్యల ద్వారా భారత్ లోని ఢిల్లీ పెద్దల మనసు మారుతుందనుకోవడం ఓ కలని తేల్చి చెప్పారు.