India-Russia: పుతిన్ పర్యటనకు ముందే భారత్-రష్యా $2 బిలియన్ల అణు జలాంతర్గామి ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా, రెండు దేశాల మధ్య అనేక రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఈ నేపథ్యంలో, ఓ జలాంతర్గామి (Submarine) లీజుకు సంబంధించిన ఒప్పందం కూడా సిద్ధంకావచ్చని పలు జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి. దీని విలువ సుమారుగా రెండు బిలియన్ డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ సబ్‌మెరైన్ కోసం దాదాపు పదేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి, కానీ, ధర విషయంలో ఇన్నాళ్లు సయోధ్య కుదరలేదు.
వివరాలు
రెండేళ్లలో భారత్‌కు..
పుతిన్ పర్యటన సమయంలో ఈ చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. రెండేళ్లలో రష్యా దాన్ని భారత్‌కు అందించనున్నట్లు సమాచారం. భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి మాట్లాడుతూ.. త్వరలో ఒక అటాక్ సబ్‌మెరైన్ సేవల్లో చేరనుందని. ఇప్పటికే నావికాదళంలో ఉన్న రెండు సబ్‌మెరైన్‌ల కంటే ఇది పెద్దదని తెలిపారు. అంతకు మించి వివరాలేమీ వెల్లడించలేదు.