LOADING...
Natural gas: భారత్ జాక్‌పాట్.. అండమాన్‌లో భారీ సహజ వాయువు నిక్షేపాలు 
భారత్ జాక్‌పాట్.. అండమాన్‌లో భారీ సహజ వాయువు నిక్షేపాలు

Natural gas: భారత్ జాక్‌పాట్.. అండమాన్‌లో భారీ సహజ వాయువు నిక్షేపాలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2025
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం తొలిసారిగా అండమాన్ సముద్రంలో సహజ వాయువు (నేచురల్ గ్యాస్) నిక్షేపాలను కనుగొంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) శ్రీ విజయపురం-2 బావి వద్ద గ్యాస్‌ను గుర్తించింది. ప్రారంభ టెస్టుల్లో'87 శాతం మీథేన్' ఉండడం తేలింది. గతంలో ఈ ప్రాంతంలో సంభావ్య చమురు నిక్షేపాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థ, ఇంధన మార్కెట్‌ను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశాన్ని కలిగిస్తుంది.

Details

వినియోగ, స్థానం వివరాలు

ఈ నిక్షేపాలు అండమాన్ దీవుల తూర్పు తీరానికి 17 కి.మీ దూరంలో 295 మీటర్ల నీటి లోతులో, 2650 మీటర్ల టార్గెటెడ్ లోతులో ఉన్న శ్రీ విజయపురం-2 బావి వద్ద గుర్తించబడ్డాయి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకారం ఈ ప్రాంతంలో సుమారు 2 లక్షల కోట్ల లీటర్ల చమురు నిల్వలు ఉండే అవకాశముంది. ఈ కనుగొనడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ 20 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని మంత్రి హైలెట్ చేశారు. ప్రభావాలు దిగుమతులపై ఆధారపడకుండా ఇంధన భద్రతను పెంచడం. * చమురు, గ్యాస్ ఉత్పత్తిలో స్వావలంబన సాధించడం. ఈ నాచురల్ గ్యాస్ నిక్షేపాలు భారత ఇంధన పరిశ్రమకు మైలురాయి అవుతాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

Details

 భవిష్యత్తు సూచనలు 

నిక్షేపాలను గుర్తించడానికి ముందు, జూన్ నెలలో హర్దీప్ సింగ్ ప్రకటించినట్లుగా, అండమాన్‌లో గయానా పరిణామం విధానంలో భారీ చమురు నిక్షేపాలు ఉండే అవకాశాన్ని సూచించారు.