Loading...
Airports: విమాన ప్రయాణాల్లో భారత్‌ కొత్త రికార్డులు.. టాప్‌-10 రద్దీ విమానాశ్రయాల జాబితా విడుదల
విమాన ప్రయాణాల్లో భారత్‌ కొత్త రికార్డులు.. టాప్‌-10 రద్దీ విమానాశ్రయాల జాబితా విడుదల

Airports: విమాన ప్రయాణాల్లో భారత్‌ కొత్త రికార్డులు.. టాప్‌-10 రద్దీ విమానాశ్రయాల జాబితా విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ, దేశీయ-అంతర్జాతీయ విమాన ప్రయాణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు నిత్యం ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్) కూడా ఈ జాబితాలో చేరింది. విశాఖపట్నం సమీపంలో అత్యాధునిక ప్రమాణాలతో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయంగా అభివృద్ధి చేసిన ఈ ఎయిర్‌పోర్ట్‌ భారీ కార్గో హ్యాండ్లింగ్‌ సామర్థ్యంతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణ, ఉపాధి అవకాశాల పెరుగుదలకు ఇది కీలకంగా మారనుంది.

వివరాలు

ప్రయాణికుల రద్దీ పరంగా దేశంలోని టాప్-10 ప్రధాన విమానాశ్రయాలు ఇవే...

1. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌కు సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం ప్రయాణికుల సంఖ్య, కార్గో రవాణా పరంగా భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. ఇది 5,106 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

2. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - ముంబై

ప్రయాణికుల రద్దీ, అంతర్జాతీయ ప్రయాణాల పరంగా దేశంలో రెండో అత్యంత రద్దీ విమానాశ్రయం. ముంబై నగరానికి ఉత్తరంగా సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.

వివరాలు

3. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం - బెంగళూరు

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఈ విమానాశ్రయం దేశంలో మూడో అత్యంత రద్దీ విమానాశ్రయం. బెంగళూరు నగర వ్యవస్థాపకుడు కెంపేగౌడ-I పేరు మీదుగా దీనికి నామకరణం చేశారు.

2008 మేలో ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్ట్‌ 2023లో 37.2 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించింది.

4,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విమానాశ్రయం, 2016లో కర్ణాటకలో పూర్తిగా సౌరశక్తితో పనిచేసిన తొలి విమానాశ్రయంగా గుర్తింపు పొందింది

ADVERTISEMENT

వివరాలు

4. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - హైదరాబాద్

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న ఈ విమానాశ్రయం 2008 మార్చి 23న బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ప్రారంభమైంది.

5,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇది దేశంలో నాలుగో అత్యంత రద్దీ విమానాశ్రయం.

2015లో దేశంలో తొలిసారిగా ఈ-బోర్డింగ్‌ సదుపాయం ప్రవేశపెట్టిన విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.

5. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం - చెన్నై

తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న ఈ విమానాశ్రయం దేశంలో ఐదో అత్యంత రద్దీ విమానాశ్రయం. అంతర్జాతీయ ప్రయాణాల పరంగా మూడో స్థానంలో ఉంది.

మీనంబాక్కం కార్గో టెర్మినల్‌తో పాటు తిరుశూలంలో దేశీయ, అంతర్జాతీయ టెర్మినల్స్‌ ద్వారా సేవలు అందిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

6. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - కోల్‌కతా

తూర్పు భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయమైన ఇది స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పేరు మీదుగా ఉంది.

పలు దేశీయ విమానయాన సంస్థలకు ప్రధాన హబ్‌గా సేవలందిస్తోంది.

గతంలో వేర్వేరుగా ఉన్న టెర్మినల్స్‌ను 2018లో ఒకే సమీకృత టెర్మినల్‌గా మార్చారు.

7. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - అహ్మదాబాద్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, గాంధీనగర్‌ జంట నగరాలకు సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం రాష్ట్రంలోనే అతిపెద్దది.

దేశంలో ఏడో అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచింది. దేశీయ, అంతర్జాతీయ, కార్గో సేవల కోసం వేర్వేరు టెర్మినల్స్‌ ఉన్నాయి.

వివరాలు

8. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం - కొచ్చి

కేరళలోని అతిపెద్ద, అత్యంత రద్దీ విమానాశ్రయం ఇదే. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రత్యేక టెర్మినల్స్‌తో సేవలు అందిస్తోంది.

9. గోవా అంతర్జాతీయ విమానాశ్రయాలు

గోవాలో ప్రస్తుతం రెండు ప్రధాన విమానాశ్రయాలు ఉన్నాయి.

దాబోలిమ్‌ విమానాశ్రయం: దక్షిణ గోవాలో నేవీ ఎయిర్‌బేస్‌ పరిధిలో సివిల్‌ ఎన్‌క్లేవ్‌గా పనిచేస్తోంది. 2023లో 8.5 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలందించింది.

మనోహర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం: ఉత్తర గోవాలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 2023 జనవరి 5న ప్రారంభించారు. ప్రారంభ సంవత్సరంలోనే 4.4 మిలియన్ల మంది ప్రయాణికులను ఆకర్షించింది.

వివరాలు

10. పూణే అంతర్జాతీయ విమానాశ్రయం - పూణే

మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఈ విమానాశ్రయం లోహెగావ్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ పరిధిలో సివిల్‌ ఎన్‌క్లేవ్‌గా పనిచేస్తోంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో 9.5 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలందించింది.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అత్యాధునిక కొత్త టెర్మినల్‌ భవనం ప్రస్తుతం భారీ ప్రయాణికుల రద్దీని సమర్థంగా నిర్వహిస్తోంది.

దేశంలో విమాన ప్రయాణాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాశ్రయాలు భారత ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పర్యాటకం, అంతర్జాతీయ అనుసంధానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర కూడా ఈ అభివృద్ధి ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

ADVERTISEMENT