LOADING...
PM Modi: యుద్ధ ప్రభావం మధ్య భారత్ బలంగా నిలుస్తోంది: ప్రధాని మోదీ
యుద్ధ ప్రభావం మధ్య భారత్ బలంగా నిలుస్తోంది: ప్రధాని మోదీ

PM Modi: యుద్ధ ప్రభావం మధ్య భారత్ బలంగా నిలుస్తోంది: ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ దేశాలు కొనసాగిస్తున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరతకు దారితీస్తున్నాయని ఆయన అన్నారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితులను భారత్‌ సమర్థంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. శనివారం నోయిడాలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశను ప్రారంభించిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. పశ్చిమాసియాలో నెలరోజులుగా యుద్ధం తీవ్రంగా కొనసాగుతుండటంతో ఆహారం, ఇంధనం, గ్యాస్ సరఫరాలపై గణనీయమైన ప్రభావం పడిందని తెలిపారు. అనేక దేశాలు నిత్యావసర వస్తువుల కొరతను ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రతి దేశం తీవ్రంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.

వివరాలు

ప్రజలు ఐక్యతతో ఉండాలి

ఈ సంక్షోభ ప్రభావం భారత ప్రజలు, ముఖ్యంగా రైతులపై పడకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని మోదీ వెల్లడించారు. సంక్షోభ పరిస్థితుల మధ్య కూడా దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రజలు ఐక్యతతో ఉండాలని, ప్రశాంతతను పాటించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, ప్రజల్లో భయాందోళనలు కలిగించే తప్పుడు ప్రచారాలను నివారించాలని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. తమ ప్రభుత్వ విధానాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం దృష్ట్యా అమలు అవుతాయని స్పష్టం చేశారు.

వివరాలు

రూ.11,200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం

ఇదిలా ఉండగా, నోయిడాలోని జేవర్ ప్రాంతంలో పీపీపీ విధానంలో రూ.11,200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. అధునాతన నావిగేషన్ సిస్టమ్‌లతో, సుమారు 3,900 మీటర్ల పొడవైన రన్‌వే ఏర్పాటు చేశారు. దీనిపై భారీ విమానాలు కూడా సులభంగా రాకపోకలు సాగించగలవు. సరకు రవాణాను దృష్టిలో ఉంచుకుని కార్గో-లాజిస్టిక్ జోన్‌లను అనుసంధానిస్తూ మల్టీమోడల్ కార్గో హబ్‌ను కూడా అభివృద్ధి చేశారు.

Advertisement