Page Loader
India-Canada:నిజ్జర్ హత్యపై కెనడియన్ మీడియా రెచ్చగొట్టే కథనం.. భారతదేశం తీవ్రంగా ఖండించిన భారత్‌ 
నిజ్జర్ హత్యపై కెనడియన్ మీడియా రెచ్చగొట్టే కథనం

India-Canada:నిజ్జర్ హత్యపై కెనడియన్ మీడియా రెచ్చగొట్టే కథనం.. భారతదేశం తీవ్రంగా ఖండించిన భారత్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2024
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య అనంతరం భారత్‌-కెనడా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఈ ఉదంతంపై కెనడా మీడియా సంచలన కథనం ప్రచురించడం మరింత దుమారం రేపింది. ముఖ్యంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో, ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అవాస్తవ కథనాలను పూర్తిగా కొట్టిపారేస్తున్నామని స్పష్టంచేసింది.

వివరాలు 

నరేంద్రమోదీ పేరు ప్రస్తావన 

కెనడా దేశానికి చెందిన ప్రముఖ వార్తాపత్రిక 'ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌' ఇటీవల నిజ్జర్‌ హత్య కేసు గురించి ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో, భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖను ఈ కుట్రలో భాగస్వాములుగా చూపించేందుకు ప్రయత్నించారని పేర్కొంది. అంతేకాక, భారత ప్రధాని నరేంద్రమోదీ పేరును కూడా ప్రస్తావించి మరింత చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించింది. ఈ కథనంపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ, ''సాధారణంగా మేం వార్తా కథనాలపై స్పందించబోం.అయితే, కెనడా ప్రభుత్వ వర్గాలకనుసంధానంగా వచ్చిన ఈ అవాస్తవ కథనాలను ఖండిస్తున్నాం. ఇలాంటి దుష్ప్రచారాలు భారత్‌-కెనడా సంబంధాలను మరింత దిగజారుస్తాయి''అని తెలిపారు.

వివరాలు 

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యం 

గతేడాది, ఖలిస్థానీ అనుకూలవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో భారత్‌-కెనడా దౌత్య సంబంధాలు తీవ్ర మలుపు తిన్నాయి. అంతేకాక, నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పేరును చేర్చడంతో పరిస్థితి మరింత జటిలమైంది. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం తమ దేశంలోని కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

వివరాలు 

భారత గట్టిపట్టుకు కెనడా 

ఈ పరిణామాల కారణంగా కెనడా ప్రభుత్వం పై చర్యలు కొనసాగిస్తుండగా, భారత్‌ కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తోంది. ఈ ఉదంతం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత దెబ్బతీయడంతోపాటు, భవిష్యత్‌ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.