
Sri Lankan Navy: శ్రీలంక నేవీ కాల్పుల్లో ఐదుగురు మత్స్యకారులకు గాయాలు.. తీవ్రంగా స్పందించిన ఎంఈఏ
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశానికి చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ జరిపిన కాల్పులపై విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది.
ఈ ఘటనలో ఐదుగురు మత్స్యకారులు గాయపడినట్లు తెలిసింది.
ఈ విషయంపై న్యూఢిల్లీలోని శ్రీలంక యాక్టింగ్ హైకమిషనర్‌కు భారత ప్రభుత్వం మంగళవారంనాడు సమన్లు పంపి, తీవ్ర నిరసనను తెలియజేసింది.
శ్రీలంక తీరంలోని డెల్ఫ్ట్ (Delft) ఐలాండ్ సమీపంలోని ప్రాంతానికి వెళ్లిన 13 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం మంగళవారం తెల్లవారుజామున అడ్డుకుంది.
వారిని పట్టుకోవడంలో కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో ఉన్నారు.
వివరాలు
ముగ్గురు స్వల్ప గాయాలతో చికిత్స
ఈ వివరాలను, భారత్ తీసుకున్న చర్యలను ఎంఈఏ ఒక ప్రకటనలో వెల్లడించింది.
భారత విదేశాంగ శాఖ, న్యూఢిల్లీ లోని శ్రీలంక హైకమిషనర్‌ను ఈ ఉదయం పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
పట్టబడిన మత్స్యకారులలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో జాఫ్నా టీచింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ముగ్గురు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారని తెలియజేసింది.
ఇక, జాఫ్నాలోని భారత కాన్సులేట్ అధికారులు కూడా ఆసుపత్రికి వెళ్లి గాయపడిన మత్స్యకారులను పరామర్శించారు.
వారికి, వారి కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
వివరాలు
మత్స్యకారులు తమిళనాడు, కారైకాల్ ప్రాంతాలకు చెందినవారు
ఈ విషయం కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ కూడా శ్రీలంక విదేశాంగ శాఖకు తెలియజేసింది.
"ఎలాంటి పరిస్థితుల్లోనూ బలప్రయోగం (use of force) చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఉన్న అవగాహనకు తగిన విధంగా తప్పక పాటించాలి" అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఈ 13 మంది మత్స్యకారులు తమిళనాడు, కారైకాల్ ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది.