
India-Afghanistan: కాబుల్‌లో టెక్నికల్ మిషన్‌ను భారత్ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్‌గ్రేడ్
ఈ వార్తాకథనం ఏంటి
ఏళ్ల ప్రతిష్ఠంభన అనంతరం భారత్-అఫ్గానిస్థాన్ సంబంధాలు మళ్లీ చిగురించాయి. వాణిజ్య సంబంధాలు, మానవతా సహాయం వంటి అంశాల్లో సహకారాన్ని మరింత బలపరచేందుకు భారత్ అఫ్గానిస్థాన్‌లో ఉన్న తన టెక్నికల్ మిషన్‌ను పూర్తిస్థాయి దౌత్య కార్యాలయంగా (Embassy of India) మార్చే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ శుక్రవారం వెల్లడించారు. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi)తో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తుదిరూపం దాల్చిందని ఆయన తెలిపారు. ''భారత్,అఫ్గానిస్థాన్‌ల మధ్య చారిత్రాత్మక బంధాలు ఉన్నాయి.అఫ్గాన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర కష్టకాలాల్లో ఉన్నప్పుడు భారత్ ఎప్పుడూ వారి పక్కనే నిలిచి సహాయం అందించింది,'' అని జైశంకర్ పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాబుల్‌లో భారత్‌లో దౌత్య కార్యాలయం
BREAKING: India restores full diplomatic ties with Afghanistan, Indian mission upgraded to full Embassy status pic.twitter.com/UZBfBefefO
— Nakul Singh Sagwan (@nssagwan_in) October 10, 2025