LOADING...
India-US: వీలైనంత త్వరలోనే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం: వాణిజ్య శాఖ 
వీలైనంత త్వరలోనే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం: వాణిజ్య శాఖ

India-US: వీలైనంత త్వరలోనే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం: వాణిజ్య శాఖ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌, అమెరికాలకు మేలు చేసేలా, సాధ్యమైనంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదర్చుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు అమెరికాలో వాణిజ్య సంబంధ సమస్యలపై చర్చలు జరపడానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్‌ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలను పరిగణిస్తూ వాణిజ్య చర్చలు సానుకూల దిశలో కొనసాగుతున్నాయి అని, వీటికి త్వరలో ఫలితంగా ఒప్పందం రానున్న సంకేతాలు ఉన్నాయని వివరించారు.

వివరాలు 

ఆసియాన్‌ శిఖరాగ్ర సమావేశానికి మోదీ-ట్రంప్

వాణిజ్య ఒప్పందంలో ముఖ్యమైన అంశాలపై భారత ప్రతినిధులు అమెరికా ప్రభుత్వంతో నిర్మాణాత్మక సమావేశాలను నిర్వహించారని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. అలాగే, అమెరికా తన వ్యాపార కార్యకలాపాలను భారత్‌లో మరింత విస్తరించాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేసింది. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌ మాట్లాడుతూ భారత్‌తో టారిఫ్‌ చర్చలు మంచి స్థాయిలో జరుగుతున్నాయని, ఇరు దేశాలు సమిష్టి లాభాలను గుర్తించాయని పేర్కొన్నారు. ఇక అక్టోబరులో మలేసియాలో జరగనున్న ఆసియాన్‌ శిఖరాగ్ర సమావేశానికి (ASEAN Summit) ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హాజరవుతారని వార్తలు వచ్చాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో మోదీ-ట్రంప్‌ వ్యక్తిగతంగా సమావేశమై, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చించే అవకాశం ఉందని అంచనా ఉంది.

వివరాలు 

ట్రంప్‌ ఫార్మా ఉత్పత్తులపై కొత్త టారిఫ్‌లు

ఇప్పటికే,రష్యా నుండి చమురు కొనుగోలుకు సంబంధించిన కారణాలతో ట్రంప్‌ భారత్‌పై 50శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి.తాజాగా ట్రంప్‌ ఫార్మా ఉత్పత్తులపై కొత్త టారిఫ్‌లు ప్రకటించారు. దీని వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.అమెరికా మార్కెట్‌లో ఉపయోగించే జనరిక్‌ ఔషధాలలో సుమారు 45 శాతం,బయోసిమిలర్‌ ఔషధాలలో సుమారు 15శాతం సరఫరాను భారత్‌ అందిస్తోంది. డాక్టర్‌ రెడ్డీస్‌,అరబిందో ఫార్మా, జైడస్‌, సన్‌ఫార్మా, గ్లాండ్‌ ఫార్మా వంటి సంస్థల మొత్తం ఆదాయంలో 30-50 శాతం అమెరికా మార్కెట్‌ నుంచి వస్తుంది. ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల కారణంగా, అమెరికా మార్కెట్‌లో ఈ ఔషధాల ధరల్లో రెట్టింపు పెరుగుదల వచ్చే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.