US-Iran Ceasefire: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ.. స్పందించిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై భారత్ స్పందించింది. ఇరుదేశాలు ఈ నిర్ణయాన్ని అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందంతో పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. విదేశాంగశాఖ సామాజిక మాధ్యమంలో తెలిపింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణను మేము స్వాగతిస్తున్నామని, ఇది పశ్చిమ ఆసియాలో శాశ్వత శాంతికి దారి తీస్తుందని భావిస్తున్నామని పేర్కొంది. ఉద్రిక్తతలను తగ్గించడం, నిరంతర చర్చలు కొనసాగించడం, దౌత్య మార్గాల ద్వారానే ఈ సంఘర్షణకు ముగింపు సాధ్యమని మేము ఇప్పటికే స్పష్టం చేశామని తెలిపింది.
వివరాలు
దీర్ఘకాల యుద్ధానికి తెర.. కాల్పుల విరమణతో ఉపశమనం
ఈ యుద్ధం కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య వ్యవస్థలకు అంతరాయం కలిగిందని వెల్లడించింది. తాజా ఒప్పందంతో హర్మూజ్ జలసంధి మార్గంగా నౌకల రవాణా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతుందని ఆశిస్తున్నామని పేర్కొంది. సుమారు నలభై రోజులుగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర పోరాటం కొనసాగుతుండగా,దీనికి ముగింపు పలుకుతూ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హర్మూజ్ మార్గాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఈ ఒప్పందానికి ఇరాన్ కూడా అంగీకారం తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విదేశాంగశాఖ చేసిన ట్వీట్
Statement on the recent development in West Asia ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) April 8, 2026
🔗 https://t.co/WwFCi4kXHg pic.twitter.com/wmsF4YUb7j