భారతీయ శాస్త్రవేత్త స్వాతికి ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ అవార్డు
భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్‌కు ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ అవార్డు-2023 వరించింది. వ్వవసాయంలో క్షేత్ర పరిశోధన, అన్వయ అంశాలపై చేసిన కృషికిగానూ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (IRRI)కు చెందిన స్వాతి, అద్వితీయ యువశాస్త్రవేత్తని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రశంసించింది. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ నిధులతో నడిచే ఈ సంస్థ, వరి సాగుచేసే చిన్నకారు రైతులకు అందించిన సేవలకుగానూ ఈ పురస్కారం ప్రకటించినట్లు వరల్డ్ ఫుడ్ ఫౌండేషన్ వెల్లడించింది. ఆకలి నిర్మూలన, ఆహార భద్రత పురోగతికి సహకరించే యువశాస్త్రవేత్తలకు హరిత విప్లవ పితామహుడు,నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్ అవార్డును అందిస్తారు. ఒడిశాకు చెందిన స్వాతి, దిల్లీ ఐఆర్‌ఆర్‌ఐలో విత్తన పరిశోధన విభాగాధిపతిగా కొనసాగుతున్నారు.