LOADING...
Indian Navy: ప్రతి 40 రోజులకు కొత్త స్వదేశీ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెడుతున్నాం: అడ్మిరల్ త్రిపాఠి
ప్రతి 40 రోజులకు కొత్త స్వదేశీ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెడుతున్నాం: అడ్మిరల్ త్రిపాఠి

Indian Navy: ప్రతి 40 రోజులకు కొత్త స్వదేశీ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెడుతున్నాం: అడ్మిరల్ త్రిపాఠి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2025
07:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామి భారత నౌకాదళం లో చేరుతోందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి వెల్లడించారు. సముద్ర భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు సామర్థ్యాల అభివృద్ధిపై నౌకాదళం ప్రధానంగా దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. 'స్వావలంబన'ను నౌకాదళం కేవలం వ్యూహాత్మక దృక్పథంగా కాకుండా,భవిష్యత్తు భద్రతకు బలమైన పెట్టుబడిగా చూస్తోందని వివరించారు. అడ్మిరల్ త్రిపాఠి మాట్లాడుతూ,"సగటున ప్రతి 40రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామి నౌకాదళంలోకి చేరుతుంది. 2035 నాటికి 200కు పైగా యుద్ధనౌకలు,జలాంతర్గాములు కలిగి ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం ఆర్డర్‌లో ఉన్న 52నౌకలు అన్నీ దేశీయ షిప్‌యార్డ్‌లలోనే నిర్మాణ దశలో ఉన్నాయి"అని తెలిపారు.

వివరాలు 

భారత నౌకాదళం వద్ద 145 యుద్ధనౌకలు, జలాంతర్గాములు

అలాగే, గత పది సంవత్సరాలలో దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ మూడు రెట్లు పెరిగి రూ.1.5 లక్షల కోట్లను దాటిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి భారత నౌకాదళం వద్ద 145 యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఉన్నాయని వివరించారు. అడ్మిరల్ త్రిపాఠి మాట్లాడుతూ.. ఏ నౌకాదళానికి అయినా స్వావలంబన, సమన్వయం, భద్రత అనే మూడు అంశాలే ప్రధాన స్తంభాలని అన్నారు. భారత నౌకాదళం శక్తి సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేసే దిశగా కృషి కొనసాగుతోందని చెప్పారు. భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి స్వదేశీ సాంకేతికతలు అత్యంత అవసరం అని పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుత పారిశ్రామిక వ్యవస్థలో సెమీకండక్టర్లు కూడా సబ్‌మెరైన్‌ల మాదిరిగానే కీలక భాగాలుగా మారుతున్నాయి అని వ్యాఖ్యానించారు.