LOADING...
Androth: భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ యుద్ధనౌక.. జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌షిప్‌ 'ఆండ్రోత్‌' 
జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌షిప్‌ 'ఆండ్రోత్‌'

Androth: భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ యుద్ధనౌక.. జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌షిప్‌ 'ఆండ్రోత్‌' 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2025
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత నౌకాదళంలో మరో స్వదేశీ యుద్ధ నౌక చేరింది. జలాంతర్గామి శత్రువులను గుర్తించి నాశనం చేసే సామర్థ్యం కలిగిన యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌షిప్‌ 'ఆండ్రోత్‌' శనివారం భారత నౌకాదళంలో అధికారికంగా చేరింది. ఈ యుద్ధ నౌకను కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ & ఇంజనీర్స్‌ (జీఆర్‌సీఐ) సంస్థ స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా నిర్మించింది. ప్రస్తుతం నిర్మిస్తున్న మొత్తం 8 యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షిప్‌ల (ఏఎ్‌సడబ్ల్యూ ఎస్‌డబ్ల్యూసీఎస్‌) సిరీస్‌లో ఇది రెండో యుద్ధ నౌక.

వివరాలు 

అత్యాధునిక తేలికపాటి టోర్పిడోలు,జలాంతర్గామి విధ్వంసక రాకెట్లు  

ఈ నౌకకు ముందు నిర్మించిన ఐఎన్‌ఎస్‌ ఆర్నాలా ఈ ఏడాది జూన్‌ 18న భారత నావికాదళంలో చేరింది. తాజాగా విధుల్లోకి చేరిన యుద్ధనౌకకు లక్ష దీవుల్లోని 'ఆండ్రోత్‌' అనే దీవి పేరు పెట్టారు. ఈ నౌక పొడవు సుమారు 77 మీటర్లు ఉంటూ, అత్యాధునిక తేలికపాటి టోర్పిడోలు, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లతో వ్యవస్థాపించబడింది. ఈ యుద్ధ నౌక ప్రధానంగా సముద్రంలో శత్రు సబ్‌మెరైన్‌లను గుర్తించి, వాటిని నాశనం చేయడమే లక్ష్యం.