
Indian Oil: ఇంధన కొరతపై అపోహలు.. క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆయిల్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్తాన్‌తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో, ఆన్‌లైన్ వేదికగా ఇంధనం కొరతపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో ఓ ఆందోళన ఏర్పడింది.
దీంతో చాలా మంది త్వరితగతిన ఇంధనాన్ని నిల్వ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) స్పందించింది.
ఇంధన సరఫరా విషయమై ఎలాంటి భయం అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా తగినంత చమురు నిల్వలు ఉన్నాయని, ఎక్కడా సమస్య లేదని తెలిపింది.
Details
ప్రజలు ప్రశాంతంగా ఉండాలి
దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. మా సరఫరా వ్యవస్థ పూర్తిగా సజావుగా నడుస్తోంది. భయపడాల్సిన అవసరం లేదు.
పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ సహా అన్ని ఇంధన ఉత్పత్తులు మా అవుట్‌లెట్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, అనవసరమైన రద్దీని నివారించాలి.
తద్వారా మేము మరింత మెరుగైన సేవలను అందించగలగుతామని స్పష్టం చేసింది.
అదే విధంగా IOCL తమ సరఫరా వ్యవస్థ ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుందని, భద్రతా పరిస్థితులు ఏవైనా ఉండొచ్చుగానీ ఇంధన సమస్య లేదు అనే సంకేతాన్ని ఇచ్చింది.