Viral Video : రైలు నుంచి చెత్త పారబోసిన ఉద్యోగి.. వీడియో వైరల్.. స్పందించిన భారతీయ రైల్వే
ఈ వార్తాకథనం ఏంటి
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెత్త రహిత భారత్‌ను రూపొందించేందుకు వందల కోట్ల రూపాయలు వెచ్చించి స్వచ్ఛ భారత్ (Swachh Bharat)వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ,ప్రజలను స్వచ్ఛత పాటించమని ప్రోత్సహిస్తోంది.
కానీ,ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు మాత్రం దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, తమ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్న తీరు కనిపిస్తోంది.
తాజాగా కేంద్ర రైల్వే శాఖకు చెందిన ఉద్యోగి (IRCTC Official)చేసిన పనితీరు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
సాధారణంగా,రైళ్లలో ప్రయాణికులకు భోజనాన్ని అందించే బాధ్యత రైల్వే శాఖదే.భోజనం పూర్తయిన తర్వాత ప్లేట్లు,గ్లాసులను సేకరించి,ముందుగా చెత్త బుట్టల్లో వేయాలి,అనంతరం రీసైక్లింగ్ యూనిట్లకు పంపించాలి.
అయితే, ఓ ఉద్యోగి మాత్రం ఈ నియమాలను పట్టించుకోకుండా నడుస్తున్న రైలులోంచి చెత్తను నేరుగా బయటికి విసిరేశాడు.
వివరాలు
ఉద్యోగి సస్పెండ్
ఈ చర్యను గమనించిన ప్రయాణికులు అతడిని నిలదీయగా,తన తప్పును అంగీకరించకపోగా, "ఇంకెక్కడ పడేయాలి?" అని తిరిగి వారినే ప్రశ్నించాడు.
ప్రయాణికులు దీనిని వీడియో తీశారు, అయినా ఆటను ఎలాంటి భయం లేకుండా, చెత్తను నిర్లక్ష్యంగా బయటికి విసిరేశాడు.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైన వెంటనే, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.
"సాధారణ ప్రజలు ఇలా చేస్తే వారిని అడ్డుకోవాల్సిన ఉద్యోగే ఇలా చెత్తను విసరడం ఏంటి?" అని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు "ఇదేనా ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత?" అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ ఘటన వైరల్ కావడంతో రైల్వే శాఖ దీని పట్ల గంభీరంగా స్పందించింది. అనైతికంగా వ్యవహరించిన ఆ ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అయ్యిన వీడియో ఇదే..
A senior IRCTC official throws garbage right from a moving train despite warnings. Scary to even imagine. pic.twitter.com/VLEQf7Rd7w
— Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) March 5, 2025