LOADING...
IndiGo crisis: ఇండిగో సంక్షోభం: ఆర్థిక నష్టం, ప్రభుత్వ చర్యలపై కోర్టు ప్రశ్నలు
ఇండిగో సంక్షోభం: ఆర్థిక నష్టం, ప్రభుత్వ చర్యలపై కోర్టు ప్రశ్నలు

IndiGo crisis: ఇండిగో సంక్షోభం: ఆర్థిక నష్టం, ప్రభుత్వ చర్యలపై కోర్టు ప్రశ్నలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండిగో సంక్షోభంపై దిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కోర్టు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, ఈ సమస్య అసలు ఎందుకు ఏర్పడిందని, అలాగే ఇలాంటి సమయంలో విమాన టికెట్ ధరలు విపరీతంగా ఎందుకు పెరిగాయో తెలుసుకోవాలని కోరింది. కోర్టు మాట్లాడుతూ, "సంక్షోభం కొనసాగుతూనే ఉన్నప్పుడు, ఇతర విమానయాన సంస్థలు దానినుంచి లాభం పొందడానికి ఎలా అనుమతించబడ్డాయి? టికెట్ ధరలు రూ.40,000 వరకు ఎలా చేరుకున్నాయి? ఇది ఏ విధంగా జరిగిందో వివరించాలి" అని ఆవేదన వ్యక్తం చేసింది.

వివరాలు 

సాధారణ పరిస్థితులతో పోలిస్తే టికెట్ ధరలు రెండు నుంచి మూడు రెట్లు 

ఇండిగో వందల సంఖ్యలో సేవలను రద్దు చేయడంతో,భారీ సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. దీనివల్ల,ఇతర విమానయాన సంస్థల్లో టికెట్ ధరలు సాధారణ స్థాయికి తగ్గకుండా, విపరీతంగా పెరిగాయి. సాధారణ పరిస్థితులతో పోలిస్తే టికెట్ ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరగడంతో, ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా, దేశంలో అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటి అయిన ముంబయి-దిల్లీ మధ్య విమాన సర్వీసుల ధరలు అత్యధికంగా పెరిగాయి. ఒక ఎకానమీ టికెట్‌కు రూ.35,000వరకు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు. సాధారణంగా చివరి నిమిషంలో బుక్ చేసినా,ఆ మార్గంలో రూట్ టికెట్ ధర రూ.20,000వరకు మాత్రమే ఉంటుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి కేంద్రం పరిమితులను విధించింది.అయితే ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైందని హైకోర్టు పేర్కొంది.

వివరాలు 

కోర్టు ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు

"ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించడానికి మీరు చేసిన చర్యలను అభినందిస్తున్నాం.కానీ మా అసలు ప్రశ్న ఏమిటంటే,ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం ఎవరు?ప్రయాణికులు చిక్కుకు పోవడమే కాక, ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం తగిలింది.ఆ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏమిటి?"అని అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ క్రమంలో,అడిషనల్ సొలిసిటర్ జనరల్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.అయితే, కోర్టు ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. "సంక్షోభం వచ్చిన తర్వాత మీరు చర్యలు తీసుకున్నారు. మా ప్రశ్న అది మాత్రమే కాదు. అసలు సమస్య ఎందుకు ఏర్పడింది?అప్పటివరకు మీరు ఏం చేస్తున్నారు? పైలట్లు ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడానికి కారణం ఏమిటి? ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటారు?" అని కేంద్రాన్ని ప్రశ్నించింది.

Advertisement

వివరాలు 

శీతాకాల షెడ్యూల్‌లో అదనంగా 100 సర్వీసులు 

కోర్టు, ఇండిగోకు తగిన సంఖ్యలో పైలట్లను నియమించడం, FDTL నిబంధనలను కచ్చితంగా పాటించడం వంటి ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ఇండిగో విమాన సర్వీసుల్లో 10 శాతం కోత విధిస్తున్నామని పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు. దీని ద్వారా, ఆ సంస్థ సర్వీసులను స్థిరీకరించవచ్చని, రద్దులను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఇది ఇండిగోకు భారీ ఇబ్బంది సృష్టించగలదని తెలుస్తోంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆ 10 శాతం కోత మొత్తం ఆకాశ్-స్పైస్‌జెట్ సర్వీసులకంటే సమానంగా ఉంది. ఇండిగో సంక్షోభంతో ఏర్పడిన మార్కెట్ డిమాండ్‌ను సంతృప్తిపరచడానికి, స్పైస్‌జెట్ ఇప్పటికే తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. దాంతో, స్పైస్‌జెట్ తన శీతాకాల షెడ్యూల్‌లో అదనంగా 100 సర్వీసులను చేర్చనుందని ప్రకటించింది.

Advertisement