తదుపరి వార్తా కథనం
IndiGo CEO: ఇండిగో సంక్షోభం.. సీఈఓ పీటర్ ఎల్బర్స్‌పై వేటు తప్పదా?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 06, 2025
03:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ విమానయాన సంస్థ 'ఇండిగో' సర్వీసుల్లో నెలకొన్న అంతరాయాల వల్ల దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ సంక్షోభం త్వరగా పరిష్కారం కానట్లే కనిపిస్తోంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం కేంద్రం ఇండిగో బోర్డుకు సీఈఓ పీటర్ ఎల్బర్స్ (IndiGo CEO)ను పదవి నుంచి తప్పించేలా ఆదేశాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది.
Details
భారీ మొత్తంలో జరిమానా విధించేందుకు సిద్ధం
ఇదే సమయంలో సంస్థపై భారీ మొత్తంలో జరిమానా విధించేందుకు కూడా సిద్ధమవుతోందని, సీనియర్ అధికారుల వ్యాఖ్యల ఆధారంగా సమాచారం బయటకొచ్చింది. మొత్తం మీద, ఇండిగో సేవల్లో ఏర్పడిన ఈ వ్యత్యయాలు విమానయాన రంగాన్ని కుదిపేస్తుండగా, కేంద్రం కఠిన చర్యలు తీసుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.