IndiGo Crisis: ఇండిగో క్రైసిస్.. రీఫండ్‌లపై కీలక ప్రకటన చేసిన కంపెనీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు సంక్షోభం (IndiGo Crisis) కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి పడిగాపులు కాస్తూ నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల టికెట్లకు సంబంధించిన రీఫండ్‌లపై ఇండిగో ముఖ్య ప్రకటన విడుదల చేసింది. సాధ్యమైనంత త్వరగా రీఫండ్ చెల్లింపులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ ప్రకటించింది. ఇండిగో విమానాల రద్దుకు దారి తీసిన పరిణామాలపై సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమస్యకు కారణమైన అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
Details
ప్రయాణికులకు పూర్తి సాయం అందించేందుకు ఏర్పాట్లు
సీఈవో సహా బోర్డు సభ్యులు క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (CMG)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ గ్రూప్ విమాన సర్వీసుల పునరుద్ధరణను వేగవంతం చేయడం పాటు, సంక్షోభం నుండి బయటపడేందుకు అవసరమైన చర్యలను చేపట్టనుంది. అంతేకాకుండా రద్దయిన సర్వీసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు పూర్తి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఇండిగో వెల్లడించింది. రద్దయిన విమానాల రీఫండ్‌లు, రీషెడ్యూలింగ్‌పై మినహాయింపులను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని బోర్డు సభ్యులు చెప్పారు.